Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Sprouted Potatoes: మీ ఇంట్లో మొలకెత్తిన బంగాళదుంపలు ఉంటే వెంటనే తీసి బయట పడేయండి..ఎందుకంటే?

Sprouted Potatoes: మీ ఇంట్లో మొలకెత్తిన బంగాళదుంపలు ఉంటే వెంటనే తీసి బయట పడేయండి..ఎందుకంటే?

Sprouted Potatoes Health Risks: వంటింట్లో కనిపించే అనేక కూరగాయలలో బంగాళదుంప ఒకటి. దీని ప్రత్యేకత ఏంటంటే? దీని అనేక ఇతర కూరగాయలతో జోడించి తినవచ్చు. అందుకే, బంగాళదుంపను కూరగాయల రాజు అని పిలుస్తారు. వీటిలో ఉండే అనేక పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బంగాళదుంపను ఫ్రెంచ్ ఫ్రైస్, చీజ్ బాల్స్ తో పాటు అనేక వంటకాలను తయారు చేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు. బంగాళదుంప రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. దీని రోజు ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి.

- Advertisement -

అయితే, కొన్ని రకాల బంగాళదుంపలు ఆరోగ్యానికి హానికరం కలిగించవచ్చు. అవును నిజమే! మొలకెత్తిన బంగాళదుంపలు తీసుకుంటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మొలకెత్తిన ఆహారాలను ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించినప్పటికీ, మొలకెత్తిన బంగాళదుంపలను మాత్రం తీసుకోవడం ఆరోగ్యానికి చాలా డేంజర్. ఈ నేపథ్యంలో మొలకెత్తిన బంగాళాదుంపలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం? వీటిని ఎందుకు తినకూడదు? ఈ ఆర్టికల్ ద్వారా వివరంగా తెలుసుకుందాం.

మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి ఎందుకు హానికరం?

మొలకెత్తిన బంగాళదుంపలలో సోలనిన్ , చాకోనిన్ అనే రెండు గ్లైకోఆల్కలాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని మితంగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్, రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే, ఈ రెండు సమ్మేళనాలు అధిక మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం. ఎందుకంటే గైక్ ఆల్కలాయిడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం, తక్కువ రక్తపోటు, ఇతర అనారోగ్య సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది.

మొలకెత్తిన బంగాళదుంపలను ఎందుకు తినకూడదు?

విషపూరితం: మొలకెత్తిన బంగాళదుంపలలో కనిపించే గ్లైకోఆల్కలాయిడ్స్ విషపూరితమైనవి. అంతేకాదు, జీర్ణాశయాంతర, నాడీ వ్యవస్థ రుగ్మతలకు కారణమవుతాయి. దీనివల్ల వికారం, తలనొప్పి, కడుపు తిమ్మిరి, విరోచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తవచ్చు.

చేదు రుచి: గ్లైకోఆల్కలాయిడ్స్ పెరిగిన పరిమాణం కారణంగా మొలకెత్తిన బంగాళదుంపలు చేదు రుచులు కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని తినడం కష్టతరం చేస్తాయి.

పోషక విలువలు కోల్పోవడం: మొలకెత్తడం బంగాళదుంపలలో ఉన్న పోషకాలను నాశనం చేస్తుంది.

 

ఏం చేయాలి?

పైన పేర్కొన్న సమాచారం చూస్తే మొలకెత్తిన బంగాళదుంపలు ఆరోగ్యానికి అనేక విధాలుగా హానికరం అని స్పష్టంగా తెలుస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మొలకెత్తిన లేదా ఆకుపచ్చగా మారిన బంగాళదుంపలను తినకపోవడం మంచిది. మొలకెత్తిన బంగాళదుంపల నష్టాలను తగ్గించాలంటే వాటిని మొలకెత్తకుండా నిరోధించడం ఉత్తమం. దీనికోసం కేవలం ఒకటి లేదా రెండు వారాల పాటు ఉండే బంగాళదుంపలను మాత్రమే కొనుగోలు చేయాలి. బంగాళదుంపలు మొలకెత్తకుండా ఉండాలంటే వాటిని చల్లని, చీకటి, పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. బంగాళదుంపలను కొనుగోలు చేసిన కొన్ని రోజుల్లోనే తినడం మంచిది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad