Healthy eating tips: నేటి సమాజంలో యువత నుంచి మొదలుకొని వృద్ధుల వరకు నిత్యయవ్వనంగా కనిపించడానికి వివిధ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నారు. కానీ అలా ఎన్ని వాడినా ఎలాంటి లాభం ఉండదు ఎందుకంటే.. ఆ నిత్య యవ్వన రహస్యం మన ఆహారపు అలవాట్లలో దాగి ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలు మన యవ్వనాన్ని కాపాడేవి అయితే మరికొన్ని వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఐస్ క్రీం: ఐస్ క్రీం తినడం చాలా మందికి ఇష్టం. చిన్న నుంచి మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ ని ఇష్టపడతారు. కానీ ఇది మన ఆరోగ్యం పై చాలా ప్రభావం చూపుతుంది. ఐస్ క్రీంలో చక్కెర, కొవ్వు అధికంగా ఉంటాయి.ఇవి చర్మాన్ని బిగుతుగా ఉంచే కొల్లాజెన్ వంటి ప్రొటీన్లను బలహీనపరుస్తుంది. దీంతో చర్మంపై త్వరగా ముడతలు వస్తాయి. ఐస్ క్రీం అప్పుడప్పుడు తినడం మంచిదే కానీ.. ప్రతీ రోజూ తినడంతో చర్మం వృద్ధాప్యంగా కనిపిస్తుంది.
సోడా: చాలా మంది సోడాను లైక్ చేస్తారు. సోడాను ఒక రిఫ్రెష్ డ్రింక్ గా భావిస్తారు. కానీ సోడాలో అధిక చక్కెరలు, ఫాస్పోరిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి దంతాలను, ఎముకలను బలహీనపరుస్తాయి. సోడా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగి… చర్మాన్ని నిస్తేజంగా మారును. అందుకే సోడా వంటి పానీయాలకు దూరంగా ఉండటం ఉత్తమం.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు: పండ్లు మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. కానీ ప్యాక్ చేసిన పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవి కావు. వాటిలో అధిక చక్కెర, తక్కువ ఫైబర్ ఉంటుంది. ఫైబర్ లేకపోవడం వల్ల శరీరం చక్కెరను త్వరగా గ్రహించి… ఇన్సులిన్‌పై ఒత్తిడిని పెంచుతుంది. దీంతో కడుపులో మంటగా ఉంటుంది. అందుకే ప్యాక్ చేసిన జ్యూస్‌లను దూరం పెట్టి…తాజా పండ్లను తినడం ఉత్తమం.
మద్యం: మద్యం ఆరోగ్యానికి చాలా హానికరం. అయినా చాలా మంది మద్యం ప్రియులు రోజూ ఎదో ఒకసాకుతో సేవిస్తారు. కానీ అది మన శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. విటమిన్ ఎ స్థాయిలను తగ్గిస్తుంది. దీనివల్ల చర్మం పొడిగా మారుతుంది. మద్యం తీసుకోవడం వల్ల కాలేయం సైతం దెబ్బతింటుంది. ఫలితంగా శరీరం బలహీనపడి తొందరగా వృద్ధ్యప్యఛాయలు కనిపిస్తాయి. అందుకో ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం చాలా మంచిది.
కృత్రిమ తీపి పదార్థాలు: బరువు తగ్గడానికి చాలామంది చక్కెర బదులుగా కృత్రిమ తీపి పదార్థాలను ఉపయోగిస్తారు. కానీ అవి ఆరోగ్యానికి చాలా హానికరమని డాక్టర్స్ తెలిపారు. పరిశోధనల ప్రకారం… తీపిపై కోరికలను ఇవి పెంచుతాయి. దీంతో జీవక్రియపై ఒత్తిడి పెరిగి చర్మంపై త్వరగా ముడతలు రావచ్చు.
వనస్పతి: వెన్న కంటే వనస్పతి ఆరోగ్యకరమైనదని భావిస్తారు.. కానీ అది ముమ్మాటికి తప్పే. దీనిలో ఉండే కొవ్వులు చర్మానికి హానికరం చేస్తాయి. ఇవి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెంచి… మంచి కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీంతో చర్మం పొడిగా మారును. అందుకే వనస్పతికు బదులుగా సహజమైన వెన్నను తీసుకోవడం మంచిది.


