Tuesday, December 9, 2025
Homeలైఫ్ స్టైల్Protein Intake: ఒక రోజులో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..? ఎక్కువ ప్రోటీన్ తింటే ఏం జరుగుతుందో...

Protein Intake: ఒక రోజులో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి..? ఎక్కువ ప్రోటీన్ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?

Protein Intake In A Day: ఆరోగ్యకరమైన, ఫిట్ శరీరాన్ని నిర్వహించడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అనేది మన శరీరాలకు కీలకమైన ఒక ముఖ్యమైన పోషకం. ముఖ్యంగా అథ్లెట్లు, బాడీబిల్డర్లు చాలా ప్రోటీన్ తీసుకుంటారు. అయితే అధికంగా ప్రోటీన్ తీసుకుంటే ఆరోగ్యంగా, బలంగా ఉంటారని చాలా మంది భావిస్తారు. కానీ, మీకు తెలుసా ఎక్కువ మోతాదులో ప్రోటీన్ తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమని. అవును, నిజమే! ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి, బరువు పెరగడానికి దారితీస్తుంది. కాబట్టి ప్రతిరోజూ పరిమిత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అవసరం. ఈ నేపథ్యంలో ఒక రోజులో ఎంత ప్రోటీన్ తినాలి? ఎక్కువ ప్రోటీన్ తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

also read:Juice For Glowing Skin: ఈ జ్యూస్‌లు తాగితే చాలు..మెరిసే చర్మం మీ సొంతం!

ఒక రోజులో ఎంత ప్రోటీన్ తీసుకోవాలి?

ఒక సాధారణ వ్యక్తికి కిలోగ్రాము శరీర బరువుకు 0.36 నుండి 0.45 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఉదాహరణకు 50 కిలోగ్రాముల బరువున్న వ్యక్తికి దాదాపు 45 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇక వయసు వారిగా చూస్తే..

4-8 ఏళ్లు

నాలుగు నుంచి 8 ఏళ్ల పిల్లలకు రోజుకు 15-20 గ్రామాల ప్రోటీన్ కావాల్సి ఉంటుంది

 

9-12 ఏళ్లు

ఈ వయసు మధ్య గల పిల్లలకు రోజుకు 30-35 గ్రాముల ప్రోటీన్ అవసరం. ఇది వారి సంపూర్ణ ఎదుగుదలకు ప్రయోజనకరంగా ఉంటుంది.

13-18 ఏళ్లు

వీరికి రోజుకు దాదాపు 50 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది.

19- 60

ప్రతి ఒక్కరికి ఈ వయసులో శరీర బరువును బట్టి ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు, 82 కిలోల వ్యక్తికి దాదాపు 60-65 గ్రామాల ప్రోటీన్ అవసరం ఉంటుంది.

 

60 ఏళ్ల తర్వాత

60 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికి ప్రోటీన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఒక్క కిలో బరువుకు వీరు 1-1.5 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.

also read:Side Effects of Jaggery: బెల్లం ఎక్కువగా తింటే ఆరోగ్యానికి హానికరమా..? రోజుకు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసా..?

ప్రోటీన్ ఉత్తమ మూలం

మాంసం, చేపలు, గుడ్లు, పప్పుధాన్యాలు, పాల ఉత్పత్తులు వంటి ప్రోటీన్ అనేక వనరులు ఉన్నాయి.

 

ఎక్కువ ప్రోటీన్ తింటే ఏం అవుతుంది?

ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల శరీరానికి కలుగుతుంది. అధిక ప్రోటీన్ తీసుకోవడం మూత్రపిండాలపై ఒత్తిడి తెస్తుంది. ఇది మూత్రపిండాల సమస్యలకు దారితీస్తుంది. ప్రోటీన్ కేలరీలను కలిగి ఉంటుంది. కావున దీని అధిక మోతాదులో తీసుకుంటే బరువు పెరగడానికి దారితీస్తుంది. అంతేకాదు అధిక ప్రోటీన్ జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News