Chicken head biryani: చికెన్ తల బిర్యానీ (Chicken Head Biryani) ఒక ప్రత్యేకమైన నాన్‌వెజ్ వంటకం, ఇది కొంతమంది భోజన ప్రియులకు చాలా ఇష్టం ఉంటుంది. దీన్ని హైదరాబాద్‌లో కొంతమంది చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే కొన్ని వంటకాలలో దీనిని ప్రత్యేకంగా తయారు చేస్తారు. సాధారణ బిర్యాని కంటే దీని రుచి చాలా ప్రత్యేకంగా అద్భుతంగా ఉంటుంది. దీనిని ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనే అభిరుచి కలుగుతుంది. కానీ చాలా మందికి దీనిని ఎలా తయారు చేసుకోవాలో తెలియదు. అందుకే ఈ స్టోరీలో ఈ వంటకాన్ని తయారు చేసే విధానాన్ని వివరించాము. చదివి మీరూ తెలుసుకోండి.
చికెన్ తల బిర్యానీ తయారీకి కావలసిన పదార్థాలు:
తల మసాల కోసం:
చికెన్ తలలు – 3-4 (సరిగ్గా క్లీన్ చేయాలి)
ఉల్లిపాయలు – 2 (సన్నగా తరిగినవి)
టమాటోలు – 2 (చిన్న ముక్కలుగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి – 3 (చిరగనివి)
పుదీనా ఆకులు – 1 కప్పు
కొత్తిమీర – 1 కప్పు
ఉప్పు – తగినంత
కారం – 1.5 టీస్పూన్లు
ధనియాల పొడి – 1 టీస్పూన్
గరం మసాలా – 1 టీస్పూన్
తురిమిన నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
నెయ్యి / నూనె – 4 టేబుల్ స్పూన్లు
పెరుగు – 1/2 కప్పు
బిర్యానీ రైస్ కోసం:
బాస్మతి బియ్యం – 2 కప్పులు
లవంగం – 4
దాల్చిన చెక్క – 2 చిన్న ముక్కలు
యాలకులు – 3
బిర్యానీ ఆకు – 1
ఉప్పు – తగినంత
నీరు – అవసరానికి తగ్గట్టు
తయారీ విధానం:
- చికెన్ తల మసాల ప్రిపరేషన్:
ముందుగా చికెన్ తలలను బాగా క్లీన్ చేసి ఉప్పు, పసుపు వేసి 10 నిమిషాలు ఉడకబెట్టండి.
కడాయిలో నెయ్యి లేదా నూనె వేసి ఉల్లిపాయలు వేయించి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆ తరువాత టమాటోలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన తల ముక్కలు, పెరుగు, పుదీనా, కొత్తిమీర వేసి 10-15 నిమిషాలులో ఫైర్‌లో వండుకొని, చివరగా నిమ్మరసం కలపాలి.
- బియ్యం ఉడకబెట్టడం:
బాస్మతి బియ్యాన్ని ముందుగా 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తరువాత ఒక బిర్యాని హండి తీసుకొని అందులో బిర్యాని చేసుకోవడానికి సరిపడా నీరు పోసుకోవాలి. ఆ తరువాత అందులో లవంగం, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు వేసుకోవాలి. అనంతరం నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని.. బియ్యం 70% ఉడికేలా ఉడకబెట్టండి. ఆ తరువాత నీటిని వంపేసుకోవాలి.
ఇప్పుడు పెద్ద మూడిపాత్రలో క్రింద మసాలా మిశ్రమం వేసి, పైన బియ్యం వేసి, మళ్లీ మసాలా, మళ్లీ బియ్యం ఇలా రెండు మూడు లేయర్లుగా వేయండి.
చివరగా కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర చల్లి మూత పెట్టి, 15-20 నిమిషాలు దమ్ చేసుకోవాలి. ఆ తరువాత బియ్యం ఉడికిన తరువాత కిందకు దించేసుకొని వడ్డించుకోవడమే. దీని రుచి చాలా బిన్నంగా ప్రత్యేకంగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటుంది.