Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్Breakup: బ్రేకప్‌ తర్వాత అమ్మాయిలు ఎందుకు లావవుతారో తెలుసా..?

Breakup: బ్రేకప్‌ తర్వాత అమ్మాయిలు ఎందుకు లావవుతారో తెలుసా..?

Healthy Habits: ప్రేమలో ఉన్నప్పుడు కలిగే ఆనందం ఎంత గొప్పదో.. విడిపోయిన తర్వాత కలిగే బాధ అంతకంటే ఎక్కువ. ప్రేమ వైఫల్యం తర్వాత కలిగే మానసిక, శారీరక మార్పులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆర్థిక నష్టాన్ని భరించడం సులభమే. కానీ బ్రేకప్ బాధను తట్టుకోవడం చాలా కష్టం. ప్రేమించిన వ్యక్తిని మర్చిపోవడం అంత తేలిక కాదు. ఈ బాధను మర్చిపోవడానికి అబ్బాయిలు ఎక్కువగా మద్యానికి అలవాటు పడతారు. ఇక అమ్మాయిలు అయితే.. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. దీని ఫలితంగా అమ్మాయిలు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు.

- Advertisement -

ప్రేమ ఒక టానిక్: ప్రేమ అనేది ఒక అనుభూతి. అది మెదడులో మంచి రసాయనాలను విడుదల చేస్తుంది. కానీ విడిపోయిన తర్వాత ప్రతికూల ఆలోచనలు పెరుగుతాయి. ఒత్తిడి హార్మోన్ల విడుదల అధికమై.. గుండెపోటుకు సైతం దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనినే బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ప్రతికూల ఆలోచనలతో పాటుగా.. బరువు పెరగడం వంటి సమస్యలను అధిగమించవచ్చు.

Also Read: https://teluguprabha.net/lifestyle/natural-remedies-to-reduce-headache/

ఖాళీగా ఉండకండి: విడిపోయిన తర్వాత ఒంటరిగా కూర్చొని గతాన్ని తలుచుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ ప్రతికూల ఆలోచనలను పక్కన పెట్టడానికి ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండాలి. స్నేహితులతో గడపడం కొత్త హాబీలు నేర్చుకోవడం లేదా ఉద్యోగంపై దృష్టి పెట్టడం వంటివి చేయడం వల్ల మనసును మళ్లించుకోవచ్చు.

చర్మ సంరక్షణపై దృష్టి పెట్టండి: డిప్రెషన్‌లో ఉన్నప్పుడు అమ్మాయిలు తరచుగా తమను తాము నిర్లక్ష్యం చేసుకుంటారు. దీని ప్రభావం చర్మంపై స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం కాంతిహీనంగా మారుతుంది. ఈ సమయంలో ముఖ సౌందర్యాన్ని పెంచుకోవడంపై శ్రద్ధ పెట్టాలి. ఇంట్లో తయారుచేసిన ఫేస్ ప్యాక్‌లు వాడటం ఉత్తమం. కొత్త హెయిర్‌స్టైల్ ప్రయత్నించడం లేదా నెయిల్ ఆర్ట్ వేయించుకోవడం వంటివి చేయడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది.

Also Read:https://teluguprabha.net/lifestyle/how-much-sleep-do-older-adults-need-national-sleep-foundation-guidelines/

ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయవద్దు: బాధతో ఒకే చోట కూర్చుండిపోవడం లేదా అతిగా తినడం వల్ల బరువు పెరిగిపోతారు. విడిపోవడాన్ని జీవితంలో ఒక దశగా భావించి ముందుకు సాగడం నేర్చుకోవాలి. గతంలో మాదిరిగానే ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి. రోజూ వ్యాయామం చేయాలి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని చురుకుగా ఉంచుకోవడం వల్ల బరువు అదుపులో ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

సానుకూల భావాలను పెంచుకోండి: విడిపోయిన తర్వాత ప్రతికూల ఆలోచనలకు తావు ఇవ్వకండి. చుట్టూ సానుకూల వాతావరణాన్ని సృష్టించుకోండి. అవసరమైతే కౌన్సెలర్‌ను సంప్రదించడం మంచిది. మీకు ఇష్టమైన పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, కొత్త వ్యక్తులతో మాట్లాడటం వంటివి చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మానసికంగా, శారీరకంగా బలంగా మారవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad