Saturday, December 13, 2025
Homeలైఫ్ స్టైల్Migraine: వాతారవరణ మార్పుల వల్ల మైగ్రేన్ అటాక్స్..ఎలా తగ్గించుకోవాలంటే..?

Migraine: వాతారవరణ మార్పుల వల్ల మైగ్రేన్ అటాక్స్..ఎలా తగ్గించుకోవాలంటే..?

Migraine Cure: మైగ్రేన్ అనేది ఒక నిర్దిష్ట రకమైన తలనొప్పి. ఇది తీవ్రమైన, నిరంతర, తరచుగా ధ్వని, కాంతికి సున్నితత్వం వంటి ఇతర లక్షణాలతో సంభవిస్తుంది. మైగ్రేన్‌లు మెదడులోని ధమనుల సంకోచం, వ్యాకోచం లేదా విస్తరణకు కారణమయ్యే అసాధారణ మెదడు కార్యకలాపాల వల్ల సంభవిస్తాయని భావిస్తున్నారు. అయితే, తరచూ తలెత్తుతున్న మైగ్రేన్ సమస్యకు హార్మోన్స్, ఒత్తిడి, జెనటిక్ ససెప్టెబిలిటీ, నిద్ర, తినే ఆహారం వంటి వాటితో పాటు వాతావరణం కూడా కారణమంటున్నారు నిపుణులు.

- Advertisement -

తరచూ మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారి సంఖ్య ఇటీవల కాలంలో పెరుగుతోంది. ఒత్తిడి, హార్మోన్ల తేడాపాడాలు, డైట్, నిద్ర లేమి, ఆహారం , జెనటిక్స్ కారణాలతో ఈ సమస్యను ఎదుర్కొంటామన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ, మైగ్రేన్ సమస్యకు వాతావరణం కూడా ఒక ముఖ్య కారణమని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక స్టడీ ప్రకారం..అమెరికాలో 38 మిలియన్ల మంది అమెరికన్లు నిత్యం మైగ్రేన్ తో బాధపడుతున్నారని వెల్లడైంది. వాతావరణంలో వేగంగా మార్పులు పొడసూపడం వల్ల చాలామంది తీవ్రమైన తలనొప్పిబారిన పడుతున్నారు. పలు నివేదికల ప్రకారం సైతం వాతావరణంలో మార్పులు తలెత్తడం వల్ల 30 నుంచి 50 శాతం మందిలో మైగ్రేన్ వేగంగా తలెత్తుతోందని వెల్లడైంది.

Also Read: Life Style Tips: ఎలక్ట్రోలైట్లు అందించే పళ్లు ఇవే!

ఎందరికో మైగ్రేన్..

ఈ సమస్య నేడు ఎంత తీవ్రంగా మారిందంటే, వాతావరణ మార్పుల కారణంగా చాలామందిలో మైగ్రేన్ తలెత్తడం సర్వసాధారణమైపోయింది. అంటే..వాతావరణంలో మార్పులు ఎంత అనూహ్యంగా ఉంటున్నాయో మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు అమెరికాలోని కొలరాడో లో తరచూ వాతావరణం మార్పులకు గురవుతుంటుంది. దీనిపై అక్కడి న్యూరాలజిస్ట్, తలనొప్పి నిపుణులు ఒకరు మాట్లాడుతూ.. తనదగ్గరకు వచ్చే చాలామంది పేషంట్లు కొద్దిగా వాతావరణం మారినా కూడా తాము మైగ్రేన్ బారిన పడుతున్నట్టు చెపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ మైగ్రేన్ సమస్యతో చాలామంది వారి రోజువారీ పనులు కొనసాగించలేని అసహాయతను ఎదుర్కొంటుంటారు. అయితే, పర్యావరణంలో తలెత్తే మార్పులకు కొంతమంది వ్యక్తుల మెదడు ఎంతో సున్నితంగా, వేగంగా ప్రతిస్పందించడానికి కారణం ఏమిటో అర్థంగాక వైద్యులు సైతం తలపట్టుకుంటున్నారు.

నరాల వ్యవస్థ సున్నితంగా ఉంటే?

మైగ్రేన్ బారిన తొందరగా పడుతున్న వారి నరాల వ్యవస్థ ఎంతో సున్నితంగా ఉంటుంది. పర్యావరణ మార్పులకు సైతం ఈ వ్యవస్థ వేగంగా స్పందిస్తుంది. ఫలితంగా ఈ కోవకు చెందిన వారు తొందరగా మైగ్రేన్ అటాక్స్ బారిన పడుతున్నారు. గాలి ఒత్తిడిలో తలెత్తే మార్పులు, ఉష్ణోగ్రతల్లో తీవ్ర తేడాపాడాలు, తేమ, గాలి నాణ్యతలలో మార్పులుగానీ.. ఇలా ఇవన్నీ బ్రెయిన్ మార్గాలను యాక్టివేట్ చేయడంతో తీవ్ర తలనొప్పిని పలువురు ఎదుర్కొంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా గమనించవచ్చు. ఈ వాతావరణ మార్పులు అందరి మనుషులపై ఒకే రీతిలో ప్రభావం చూపవట. మనిషి మనిషిపై ఈ వాతావరణ మార్పులు విభిన్నంగా ఉంటాయని నిపుణులు చెపుతున్నారు. వాతావరణ ఒత్తిడిలో తలెత్తే మార్పులు మైగ్రేన్ వెంటనే తలెత్తడానికి ప్రధానంగా కారణమవుతోందని కూడా నిపుణులు అంటున్నారు. ఇది మెదడులోపలి ప్రెషర్ పై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. మెదడులోని రక్తనాళాలు సంకోచ, వ్యాకోచాలకు గురవుతాయి. ఈ మార్పులతో తలలోపలి భాగం, బయట పర్యావరణాల మధ్య ఒత్తిడి తలెత్తి చిన్నపాటి అసమానతలు తలెత్తుతాయి. దీంతో తలలోని పెయిన్-సెన్సిటివ్ నరాలు స్పందిస్తాయి. ఫలితంగా ఇన్ఫ్లమేషన్ తలెత్తి మైగ్రేన్ మొదలవుతుంది. సెరొటొనిన్ ప్రమాణాలలో మార్పులు తలెత్తడం వల్ల కూడా మైగ్రేన్ వెంటనే మొదలవుతుంది.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/improve-your-skin-with-carrot-salad/

ఆడవారిలో ఎక్కువగా..

నేషనల్ హెల్త్ ఇంటర్వ్యూ సర్వే 2018లో అమెరికాలోని చాలామంది మహిళలు పురుషుల కన్నా కూడా తీవ్ర మైగ్రేన్ తో బాధపడినట్టు వెల్లడైంది. 18-44 సంవత్సరాల మధ్యలో ఉన్నవారిలో ఈ మైగ్రేన్ సాధారణంగా కనిపిస్తోందని తేలింది. అలాగే ఉష్ణోగ్రతల్లోని తీవ్ర హెచ్చుతగ్గుల (బాగా వేడి లేదా బాగా చల్లదనం) వల్ల శరీరంలోని అంతర్గత వ్యవస్థలో అసమతుల్యత తలెత్తుతోంది. అంతేకాదు అత్యధిక తేమ, లేదా మాయిశ్చర్ ప్రమాణాల్లో వేగంగా చోటుచేసుకున్న మార్పుల వల్ల కూడా ఈ తరహా పరిస్థితులనే చవిచూస్తాం. అంతేకాదు ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి వాయుకాలుష్య కారకాలు నరాల వ్యవస్థలో ఇన్ఫ్లమేషన్ కు కారణమవుతున్నాయి. అది చివరకు మైగ్రేన్ కు దారితీస్తోంది. సూర్యరశ్మి ఎక్కువగా ఉన్నా కూడా మైగ్రేన్ ఇబ్బందులు తలెత్తుతాయి. సూర్యకిరణాల తీవ్రత తట్టుకోలేని సున్నితమైన చర్మం ఉన్నవారు, బ్రెయిన్ లోని ఓవర్ యాక్టివ్ విజువల్ ప్రాసెసింగ్ సిస్టమ్ వల్ల చాలామంది ప్రభావితులై మైగ్రేన్ అటాక్స్ బారిన పడుతున్నారు. అలాగే మెరుపులు (లైట్నింగ్), బలంగా వీచే గాలుల వల్ల కూడా కొందరిలో మైగ్రేన్ అటాక్స్ వస్తాయి.

Also Read: Ayurvedic Lifestyle for glowing skin: చర్మాన్ని మెరిపించే లైఫ్ స్టైల్ చిట్కాలు

ఈ సింపుల్ చిట్లకు పాటిస్తే సరి..

మైగ్రేన్ నొప్పిని తగ్గించుకోవాలంటే కొన్ని అంశాలు తప్పనిసరిగా పాటించాలి. ఈ తరహా వ్యక్తులు తమ మైగ్రేన్ తీవ్రతలను ఎప్పటికప్పుడు రాసుకుంటుండాలి. వాటిని ట్రాక్ చేస్తుండాలి. అలాగే వాతావరణంలో పొడసూపుతున్న మార్పుల వివరాలను కూడా ట్రాక్ చేయాలి. ఇవన్నీ గమనించడం వల్ల మైగ్రేన్ పాట్రన్స్ ఎలా ఉన్నాయో గుర్తించవచ్చు. వర్షం ముందు మైగ్రేన్ పాట్రన్ ఎలా ఉంది? అలాగే ఉష్ణోగ్రతల్లో మార్పులు పొడసూపినపుడు మైగ్రేన్ తీవ్రత ఎలా ఉంది? వంటి అంశాలు గమనించి రాసుకోవడం వల్ల సరైన మెడికల్ ప్లాన్ ను పాటించవచ్చని నిపుణులు చెపుతున్నారు.

మైగ్రేన్ బారిన పడకుండా ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పెంపొందించు కోవాలని కూడా చెపుతున్నారు. అలాగే నిద్ర వేళలు పాటించాలి. నిత్యం వ్యాయామాలు చేయాలి. డీహైడ్రేషన్ కారణంగా కూడా మైగ్రేన్ బారిన పడతారు. అలాగే నిద్ర సరిగా లేకపోయినా మైగ్రేన్ తో బాధపడతారు. మీల్స్ చేయనపుడు వాతావరణంలో తలెత్తే మార్పుల ప్రభావం వారిపై మరింతగా పడుతుంది. దీంతో మైగ్రేన్ అటాక్స్ భరించలేనంతగా బాగా తీవ్రంగా ఉంటాయి. నిత్యం వ్యాయామలు, ఆరోగ్యకరమైన డైట్ అలవాట్లను పెంపొందించుకుంటే తొందరగా మైగ్రేన్ బారిన పడరని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అలాగే మైగ్రేన్ ఫ్రెండ్లీ పర్యావరణాన్ని స్రుష్టించుకోవాలి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నా, తేమ తీవ్రంగా ఉన్నా అలాంటి రోజుల్లో బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. బయటకు వచ్చిన కాసైపైనా కూడా సన్ గ్లాసులు, ఐమాస్కులు వంటి రక్షణ కవచాలు తప్పనిసరిగా ధరించాలి. బ్లూలైట్ కళ్లజోళ్లు కూడా ఈసమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి.

ALSO READ: https://teluguprabha.net/lifestyle/can-you-eat-dates-during-pregnancy/

ఇవి కాకుండా ధ్యానం, ఏకాగ్రతా టెక్నిక్స్ నిత్యం తప్పనిసరిగా సాధన చేయాలి. అప్పుడు భౌతికంగా తలెత్తిన మార్పుల తీవ్రతను సులభంగా తగ్గించుకోగలరు. తట్టుకోగలరు. అంటే కండరాల స్పందన, బ్రీదింగ్ వంటి వాటిని మోడరేట్ చేసుకోగలరు. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల నరాలవ్యవస్థ ఇలాంటి తీవ్ర వాతావరణ మార్పులకు తక్కువగానే స్పందిస్తుంది. తుపానులు లాంటివి మైగ్రేన్ అటాక్స్ తెప్పిస్తాయని భావించేవాళ్లు తుపానులు వస్తాయని తెలిసినపుడు ముందుగానే దానికి తగిన మెడికేషన్స్, ప్రీట్రీట్మెంట్లను కొనసాగించాలని కూడా నిపుణులు సలహా ఇస్తున్నారు. అంతేకాదు మైగ్రేన్ అటాక్స్ రాకుండా ప్రివెంటివ్ ట్రీట్మెంట్లు అనుసరించవచ్చని సూచిస్తున్నారు. వాతావరణంలో మార్పులు తరచూ తలెత్తుతుంటే తరచూ మైగ్రేన్ పాలబడుతుంటాం. అందుకే ఇలాంటప్పుడు మెడికేషన్లు, సప్లిమెంట్లు, న్యూరోమాడ్యులేషన్ పరికరాలు నిత్యం వాడితే మైగ్రేన్ అటాక్స్ బారిన తొందరగా పడమని నిపుణులు భరోసా ఇస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News