Hair Growth Tips: ప్రతి ఒక్కరూ మందపాటి, పొడవైన, బలమైన జుట్టును కోరుకుంటారు. అయితే నేటి జీవనశైలి, సరైన ఆహారం లేకపోవడం, ఒత్తిడి కారణంగా జుట్టు రాలడం, పెరుగుదల మందగించడం వంటివి సాధారణ సమస్యలుగా మారాయి. చాలామంది జుట్టు పెరుగుదల కోసం మార్కెట్లో లభించే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడుతుంటారు. అయినా అవి ఆశించినంత ఫలితాలు అందించవు.ఇటువంటి పరిస్థితులో జుట్టు సంరక్షణ కోసం మునగ ఆకులు ఉపయోగించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. జుట్టుకు చాలా ప్రయోజనకరమైన అనేక పోషకాలు మునగ ఆకులలో ఉంటాయి. ఇవి మందపాటి, పొడవైన, బలమైన జుట్టును ప్రోత్సహిస్తాయి. అయితే, మోరింగను ఉపయోగించి జుట్టు పెరుగుదలను ఎలా ప్రోత్సహించవచ్చో ఈ ఆర్టిల్ ద్వారా తెలుసుకుందాం.
మోరింగ జుట్టుకు ఎందుకు ప్రయోజనకరం
మునగ ఆకులలో విటమిన్లు A, B, C, E, కాల్షియం, పొటాషియం, ఐరన్ జింక్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి. ఈ మూలకాలన్నీ జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. అలాగే, మోరింగలో ఉండే అమైనో ఆమ్లాలు కెరాటిన్ ఏర్పడటానికి సహాయపడతాయి. ఇది బలమైన, పొడవైన జుట్టుకు దారితీస్తుంది. అదనంగా, దాని శోథ నిరోధక, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నెత్తిని ఆరోగ్యంగా ఉంచుతాయి. చుండ్రు వంటి సమస్యలను నివారిస్తాయి.
జుట్టు పెరుగుదలకు మోరింగను ఎలా ఉపయోగించాలి?
1. మోరింగ పౌడర్ హెయిర్ మాస్క్
పొడవాటి జుట్టుకు సహాయపడే మోరింగ పౌడర్ హెయిర్ మాస్క్ కోసం ముందుగా రెండు టీస్పూన్లు మోరింగ పౌడర్ తీసుకోవాలి. దీని ఒక టీస్పూన్ పెరుగు లేదా తురిమిన కొబ్బరిని జోడించాలి. ఒకవేళ జుట్టు పొడిగా ఉంటే, ఆలివ్ నూనెను కూడా కలపవచ్చు. అనంతరం ఈ పేస్ట్‌ను బాగా కలిపి తలకు, జుట్టుకు బహ పట్టేలా అప్లై చేయాలి. దాదాపు 45 నిమిషాల పాటు వెయిట్ చేసి తలను తేలికపాటి షాంపూతో క్లీన్ చేయాలి. ఈ మాస్క్‌ను వారానికి రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదల వేగవంతం అవుతుంది. మృదువుగా కూడా మారుతుంది.
2. మోరింగ నూనె
ఎండు మోరింగ ఆకులను నూనెలో వేసి కొద్దిగా వేడి చేసుకోవాలి. ఈ గోరువెచ్చని నూనెతో వేళ్లను ఉపయోగించి తలకు బాగా మసాజ్ చేయాలి. కనీసం ఈ మసాజ్ ఒక గంట చేసి, రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే తేలికపాటి షాంపూతో తలను వాష్ చేయాలి. ఇలా ఆయిల్‌తో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది జుట్టు మూలాలను బలపరుస్తుంది.
3. మోరింగ ఆకు పేస్ట్
జుట్టు పెరుగుదలకు మోరింగను ఉపయోగించే మరో విధానం తాజా మునగ ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌కు కాస్త తేనె ను జోడించి బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నేరుగా తలకు అప్లై చేయాలి. దాదాపు 30 నిమిషాల తర్వాత తలను చేయాలి చేయాలి. ఇది కొత్త జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
4. తీసుకునే ఆహారంలో
ఆహారంలో కూడా మునగ పొడిని చేర్చుకోవచ్చు. ఒక టీస్పూన్ మునగ పొడిని ఒక గ్లాసు నీరు, స్మూతీ లేదా పెరుగుతో కలిపి ప్రతిరోజూ ఉదయం తీసుకోవచ్చు. ఇది రక్తహీనతను ఎదుర్కోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జుట్టు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


