Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్HI life exhibition: లగ్జరీ ఫ్యాషన్.. హాయ్ లైఫ్

HI life exhibition: లగ్జరీ ఫ్యాషన్.. హాయ్ లైఫ్

HI life exhibition: మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ హైదరాబాద్ మరోసారి ఫ్యాషన్ కలెక్షన్ కు రెడ్ కార్పెట్ వేస్తోంది.  ట్విన్ సిటీస్ లో రెగ్యులర్ గా జరిగే హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ మరోసారి ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది మరి.  ఫ్యాషన్ లో లగ్జరీ ఫ్యాషనుకుండే స్పెషాలిటీ చాలా ఎక్కువ.  అందునే మనవాళ్లకు కాస్త ఈ లగ్జరీ క్రేజ్ ఎక్కువే. అందుకే ఈసారి లగ్జరీ ఫ్యాషన్ అనుభవాన్ని ఫెస్టివల్ సీజన్ లో మరింత స్పెషల్ గా తెస్తోంది హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్.

- Advertisement -

కేరాఫ్ బ్రైడల్ కోచర్

హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ బ్రైడల్ కోచర్ కు కేరాఫ్ గా మారింది.  ఫ్యాషన్ లవర్స్ ను ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉండేలా ఈసారి ఎక్స్ క్లూజివ్ డిజైనర్  బ్రైడల్ వేర్ ను మీకోసం తెచ్చింది హాయ్ లైఫ్. ఫెస్టివల్ ఫ్యాషన్, డిజైనర్ జ్యువెలరీ, యాక్సెసరీస్ .. అద్భుతమైన క్యూరేషన్‌ తో మిమ్మల్ని అలరించేలా ఈ ప్రదర్శన ముస్తాబయింది.

టాప్ డిజైనర్స్ మాస్టర్ పీసెస్ తోపాటు సీజన్ ట్రెండ్‌సెట్టింగ్ కలెక్షన్‌లను ఇక్కడ మీరు హ్యాపీగా సొంతంచేసుకోవచ్చు.అగ్రశ్రేణి డిజైనర్లను కలిసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కూడా. రాబోయేదంతా ఫెస్టివల్ సీజన్ కాబట్టి మీ క్లాజెట్ ను మరింత ఫ్యాషనబుల్ గా మార్చేలా హాయ్ లైఫ్ ఎగ్జిబిషన్ ఉండటం హైలైట్.  మీ వార్డ్ రోబ్ ను ఇంట్రెస్టింగ్ గా మార్చే ఈ ఎగ్జిబిషన్ ఈనెల 29, 30, 31వ తేదీల్లో మూడు రోజులపాటు హెచ్ఐసీసీ నోవోటెల్ లో జరుగనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad