ఏ కాలమైనా దోమలకు ఒక్కటే. ఎక్కువగా వర్షాకాలం, చలికాలంలో ఈ దోమలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. మరో వైపు ఎండలకాలంలో వాతవరణం కాస్తా వేడి పడటంతో ఈ దోమల బెడద కూడా ఎక్కువ అవుతుంది. రాత్రుల్లో ఈ దోమలతో సరిగ్గా నిద్ర పట్టదు. ఇవి కుట్టడంతో తీవ్ర అనారోగ్యానికి గురి కావాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఇంట్లో కొన్ని మొక్కలు నాటడం ద్వారా దోమలను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం పదండి.
చలికాలం పోక ముందే ఎండలు అదరగొడుతున్నాయి. ఇప్పుడే మే నెలను తలపించేలా 35 డిగ్రీల సెలియస్ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అలాంటి సమయంలో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందిపడుతూ.. ఆరు బయటనే నిద్రించేందుకు ఇష్టపడుతుంటారు. పైగా వాతవరణం పొడిబారడంతో దోమల తీవ్రత కూడా అంతకంతకు పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
ఈ దోమల నుంచి తమను తాము రక్షించుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటారు. ఈ దోమలు మన రక్తాన్ని పీలుస్తూనే, దోమల వల్ల కూడా అనేక రకాల వ్యాధులు వస్తాయి. ప్రతి సంవత్సరం, దోమల కాటు కారణంగా మిలియన్ల మంది ప్రజలు మలేరియా మరియు డెంగ్యూ బారిన పడుతున్నారు. అంతే కాకుండా అనేక రకాల ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి.
ఈ దోమల బారిన నుంచి తప్పించుకోవాటానికి దోమతెరలు, మస్కోటో కాయిన్స్, ఆల్ అవుట్, గుడ్ నైట్ తదితర రసాయనిక మందులను వాడుతుంటాం. వీటి వల్ల కాస్తా అనారోగ్యానికి గురి కావాల్సి ఉంటుంది. అయితే ఇందుకు ప్రత్యామ్నాయంగా ఈ మెుక్కలను నాటుకోవటం వల్ల దోమల నుంచి మనల్నీ మనం రక్షించుకోవచ్చు. ప్రకృతిలో ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయని, వీటి సువాసన వల్ల దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయని వైద్యులు సూచిస్తున్నారు.
ఇంటి చుట్టూ సిట్రోనెల్లా గడ్డిని పెంచుకుంటే దోమలు రాకుండా చూసుకోవచ్చు. సిట్రోనెల్లా గడ్డి సువాసనను కలిగి ఉంటుంది. దీని నూనెను సుగంధ ద్రవ్యాలు మరియు సబ్బులలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా, రోజ్మేరీ మొక్క దోమలను తరిమికొట్టడంలో అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతుంది.
రోజ్‌మేరీ మొక్కలు. ఈ మెుక్కకు నీలం రంగు పువ్వులు పూస్తాయి. ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ మొక్క వేసవి నుండి వర్షాకాలం వరకు చాలా చురుకుగా ఉంటుంది. ప్రజలు తమ ఇళ్లలో బంతి పూవ్వుల మెుక్కలను నాటవచ్చని తెలిపారు. బంతి పువ్వులు కూడా కీటకాలు మరియు దోమలను దూరంగా ఉంచుతాయి. ఇంటి అందం కూడా పెరుగుతుంది.
అంతే కాకుండా ఇంట్లో ఉండే లావెండర్ మొక్క కూడా దోమలను దూరం చేస్తుంది. ఈ మెుక్కలు దోమలు ఇంట్లోకి రాకుండా ఉండేందుకు చాలా ఉపయోగపడుతుంది. ప్రజలు తమ ఇళ్లలో వెల్లుల్లి మొక్కలను, తులసి మొక్కలు నాటాలని సూచించారు. ఇది చాలా ప్రయోజనకరంగా కూడా పరిగణించబడుతుంది. దాని సువాసన నుండి దోమలు పారిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
Plants: ఈ మెుక్కలుంటే మీ ఇంట్లో దోమలుండవు..!!
- Advertisement -
సంబంధిత వార్తలు | RELATED ARTICLES