Fenugreek Hair Pack: నేటి జీవనశైలి, పెరుగుతున్న కాలుష్యం, ఆహారపు అలవాట్లు జుట్టు ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనివల్ల జుట్టు రాలడం, చుండ్రు, పొడిబారడం వంటి సాధారణ సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో చాలామంది మార్కెట్లో దొరికే రసాయన షాంపూలు, ఇతర ఉత్పత్తులపై ఆధారపడుతున్నారు. కానీ ఇవి ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేకపోతున్నాయి. అయితే జుట్టు సహజంగా బలంగా, మందంగా, మెరిసేలా ఉండాలంటే కొన్ని ఇంటి సహజ పద్ధతులను పాటిస్తే సరిపోతుంది. ఇవి ఎంతో సురక్షితమైనవి.
వంట గదిలో ఉండే మెంతి గింజలు ఆహార రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ఆయుర్వేదంలో మెంతి గింజలను జుట్టు ఆరోగ్యానికి అమృతంగా పరిగణిస్తారు. ఇందులో ఉండే ప్రోటీన్, ఐరన్, నికోటినిక్ ఆమ్లం, లెసిథిన్ వంటివి జుట్టును పోషించడంలో సహాయపడుతాయి. అంతేకాకుండా జుట్టును బలంగా ఉంచుతుంది. అయితే ఇప్పుడు జుట్టుకు పూర్తి ప్రయోజనం చేకూర్చడానికి మెంతిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మెంతి గింజల పేస్ట్‌తో హెయిర్ మాస్క్
రాత్రిపూట 2 టీస్పూన్ల మెంతి గింజలను నీటిలో నానబెట్టుకోవాలి. ఉదయాన్నే దీన్ని గ్రైండ్ చేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ని తలకు, జుట్టు పొడవునా బాగా అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో క్లీన్ గా కడగాలి. ఈ మాస్క్ జుట్టును బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా చుండ్రును కూడా తగ్గిస్తుంది.
మెంతులు, పెరుగు
మెంతులను నానబెట్టి పేస్ట్ లా తయారు చేసి దానికి 2 టీస్పూన్ల పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి దాదాపు 30-40 నిమిషాలు అలాగే ఉంచాలి. ఈ మాస్క్ జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అలాగే తల దురదను కూడా తగ్గిస్తుంది.
Also Read: Smart Phones: రాత్రిపూట మీ పిల్లలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారా..?
మెంతి నూనె
కొబ్బరి లేదా నువ్వుల నూనెలో మెంతి గింజలను వేసి 5-7 నిమిషాలు పాటు తక్కువ ఫ్లేమ్ లో వేడి చేయాలి. తరువాత నూనెను చల్లబరిచి వడకట్టాలి. ఈ నూనెతో వారానికి 2-3 సార్లు జుట్టుకు మసాజ్ చేసుకోవాలి. ఈ నూనె జుట్టు మూలాలకు పోషణనిస్తుంది. జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
మెంతి పొడి వాడకం
మెంతులను గ్రైండ్ చేసి పౌడర్ లా తయారు చేసుకోవాలి. ఆమ్లా లేదా శికాకై పౌడర్ తో కలిపి నీరు లేదా పెరుగులో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి దాదాపు 30-40 నిమిషాలు అలాగే ఉంచి క్లీన్ చేసుకోవాలి. ఈ హెయిర్ ప్యాక్ జుట్టు పెరుగుదలను పెంచుతుంది.
మెంతి నీరు
ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీరు తీసుకోవడం వల్ల జుట్టు లోపలి నుండి పోషణ లభిస్తుంది. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది.


