Health tips: నీటి బిజీ లైఫ్ లో చాలామంది అనేక కారణాలవల్ల ఒత్తిడికి గురవుతున్నారు. దీని కారణంగానే వారు సరిగ్గా నిద్ర పోలేక పోతున్నారు. రాత్రంతా మేల్కొంటూ సమయాన్ని గడుపుతున్నారు. దీంతో అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇది బరువు పెంచడమే కాకుండా అలసట, బద్ధకానికి కూడా దారితీస్తుంది. చాలామంది నిద్ర పోవడానికి అనేక పద్ధతులను అవలంబిస్తారు. ఇందులో భాగంగానే నిద్ర మాత్రలు తీసుకోవడం, మద్యం సేవించడం వంటివి చేస్తారు. ఇవి కొంతకాలం అనుభూతిని కలిగించినప్పటికీ ఇది ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. అయితే రాత్రిపూట నిద్ర రావాలంటే పాలు త్రాగొచ్చు. పాలు తాగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక, మానసిక అభివృద్ధికి సహాయపడే కాల్షియం, కార్బోహైడ్రేట్లు, విటమిన్లు, వంటివి అనేక పోషకాలు పాలలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ మూడు పదార్థాలను పాలలో కలిపి రాత్రి హాయిగా నిద్ర పడుతుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
పసుపు పాలు
రాత్రి పడుకునే ముందు పసుపు పాలు తాగితే అలసట నుండి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది గాఢ నిద్ర పొందడానికి సహాయపడుతుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం మనసును ప్రశాంత పరుస్తుంది. హాయిగా నిద్ర పోవడానికి కూడా సహాయపడుతుంది.
తేనే పాలు
నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి తేనె పాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు పడుకునే ముందు తేనే పాలు తాగితే హాయిగా నిద్ర పడుతుంది. ఇది కండరాలను సడలిస్తుంది. తేనె పాలు ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది.
అశ్వగంధ పాలు
ఆయుర్వేదంలో అశ్వగంధకు ముఖ్యమైన స్థానం ఉంది. ఇది అనేక నిద్ర సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అశ్వగంధ పొడితో కలిపిన పాలు తాగితే నాడీ వ్యవస్థను సడలిస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పాలను త్రాగితే ఇట్టే నిద్రపోవచ్చు. అయితే, ప్రతిరోజు రాత్రి పూట పాలు త్రాగిన తరువాత కొద్దిసేపు వాకింగ్ చేయాలి. లేదంటే జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.