Raisins for Vitamin-B12: అధిక అలసట, రక్తహీనత, నోటి పూతల, చిన్న చిన్న విషయాలు మరిచిపోవడం వంటి లక్షణాలు మీకు అనిపిస్తున్నాయా.? అయితే మీ శరీరంలో విటమిన్-B12 లోపం ఉండవచ్చు. సాధారణంగా విటమిన్-B12 లోపం ఉన్నప్పుడు ఈ లక్షణాలు కనిపిస్తాయి. అయితే దీనికోసం ఎలాంటి ఆందోళన చెందకుండా ఆహారాన్ని మెరుగుపరుచుకుంటే ఈ లోపాన్ని తీర్చవచ్చు.
నాన్ వెజ్, గుడ్లు, పాల ఉత్పత్తుల వంటి జంతువుల ఆహారాలలో మాత్రమే విటమిన్ B-12 ఉంటుందని అందరూ అనుకుంటారు. కానీ, దీని లోపాన్ని అధిగమించడంలో సహాయపడే కొన్ని శాఖాహార ఆహారాలు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు. అలాంటి ఆహారాలలో ఎండు ద్రాక్ష ఒకటి. ఇది విటమిన్ B-12 లోపాన్ని తీర్చడంలో ఎంతో సహాయపడుతుంది.
విటమిన్ B-12 లోపాన్ని అధిగమించడంలో ఎండుద్రాక్ష ఎలా సహాయపడుతుంది?
మార్కెట్లో తక్కువ ధరకే దొరికే ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. దీంతో శరీరంలో ఈ విటమిన్ మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.
ఎండు ద్రాక్ష ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. విటమిన్ B-12 శరీరంలో శక్తి స్థాయిని తగ్గిస్తుంది. దీంతో ఎండుద్రాక్షలను తీసుకుంటే ఇందులో ఉండే సహజ చక్కెర తక్షణమే శరీరానికి శక్తిని ఇస్తుంది. విటమిన్ B-12 లోపం వల్ల కలిగే బలహీనతను తొలగించడంలో సహాయపడుతుంది.
ఎండు ద్రాక్ష లో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా. అంతేకాకుండా పోషకాలను బాగా గ్రహించడంలో ఎంతో సహాయపడుతుంది. ఇది శరీరం విటమిన్ B-12 పొందడానికి సహాయపడుతుంది.
దీనిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం విటమిన్ B-12 లోపం వల్ల కలిగే రక్తహీనతకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎండు ద్రాక్షానో క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే శరీరంలోని ఇనుము లోపాన్ని తీరుస్తుంది.
ఎండుద్రాక్షను ఎలా తినాలి?
1. 8-10 హిందూ ద్రాక్షలను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం కాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్షలను, నీటితో సహా తీసుకోవాలి.
2. ఎండుద్రాక్షలను నీటిలో లేదా పాలలో కూడా నానబెట్టి తినవచ్చు.
3. ఎండు ద్రాక్షలను నేరుగా తినవచ్చు లేదా ఇతర ఆహార పదార్థాలలో కూడా కలుపుకొని తినవచ్చు.