ప్రతి ఒక్కరికీ పుట్టుక తెలుస్తుంది. వయసూ తెలుస్తుంది. కానీ మరణం ఎప్పుడు, ఎలా చనిపోతామో ఎవరికీ తెలియదు. ఇలాంటి విషయం చెప్పేందుకు ఓ వెబ్‌సైట్ ఉంది. అందులో కొన్ని వివరాలు అడుగుతారు. అవి ఇచ్చిన తర్వాత మరణం ఎప్పుడు సంభవిస్తుందో తేదీతో సహా చెబుతుంది. అదే డెత్ క్లాక్. సహజంగా ఎవరికీ తాము ఎప్పుడు చనిపోతామన్నది తెలుసుకోవడం ఇష్టం ఉండదు. అఫ్‌కోర్స్ ఈ వెబ్‌సైట్ కూడా కచ్చితంగా ఆన్సర్ ఇవ్వదు. జస్ట్ సరదాగా తెలుసుకోవడానికి మాత్రమే ఇది ఉంది.
మరణం ఎప్పుడో తెలుసుకోవాలి అనుకునేవారు ముందుగా… తాము పుట్టిన నెల, తేదీ, సంవత్సరం వివరాలు ఇవ్వాలి. అలాగే మేల్, ఫిమేల్ అన్నది చెప్పాలి. స్మోకింగ్ చేస్తారో లేదో చెప్పాలి. బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో చెప్పాలి. మద్యం తాగుతారా, ఏ దేశానికి చెందినవారు వంటివి వివరాలు ఇచ్చి సబ్‌మిట్ కొట్టాలి. చాలా మందికి బాడీ మాస్ ఇండెక్స్ ఎంతో తెలియదు. అది తెలుసుకోవడానికి ఈ వెబ్‌సైట్‌లో ఆప్షన్ ఉంది. అందులో BMI తెలుసుకోవచ్చు.
ఉదాహరణకు ఓ అమ్మాయి 2005, ఆగస్ట్ 14న పుట్టి ఉంటే… ఆమెకు BMI 25 కంటే తక్కువ ఉంటే… భవిష్యత్తుపై పాజిటివ్ ఆలోచన (optimistic)తో ఉంటే, మద్యం, సిగరెట్ల వంటివి తాగకపోతే, ఇండియాకు చెందిన అమ్మాయి అయితే.. ఆమె వివరాలు ఇలా ఇవ్వవలసి ఉంటుంది. సబ్‌మిట్ కొట్టాక ఆమె మరణం ఎప్పుడో చెబుతుంది. ఆమె 85 ఏళ్లు బతుకుతుందనీ… 2090 సెప్టెంబర్ 20న బుధవారం నాడు చనిపోతుందని చెబుతుంది. ఇలా ఓ రెస్ట్ ఇన్ పీస్ జ్ఞాపికను కూడా ఇస్తుంది.
భవిష్యత్తులో మన మరణం గురించి తెలుసుకోవడం అనేది అనేక సాంప్రదాయాలను, భవిష్యవాణీలను కలిగి ఉంటుంది. కానీ శాస్త్రీయంగా ఇది చాలా క్లిష్టమైన విషయం. జీవితం గమ్యాన్ని ముందుగా చెప్పడం అసాధ్యం. కాబట్టి, ఇలాంటి అప్లికేషన్లు వినోదం లేదా ఆసక్తికరమైన అంశాలుగా మాత్రమే చూడటం మంచిది. అయితే చావుని ఇలా జోక్ చేస్తోందని ఈ వెబ్‌సైట్‌పై కొంత మందికి కోపం ఉంది. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఈ వెబ్ సైట్లో వివరాలు నమోదు చేశారు.