Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Bath: జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయాలా.. వద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా!

Bath: జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయాలా.. వద్దా?.. చేస్తే ఏమవుతుందో తెలుసా!

Bathing benefits: వర్షాకాలం వచ్చిందంటే చాలు వైరల్ ఫీవర్స్ తో ప్రతి ఒక్కరూ తెగ ఇబ్బంది పడతారు. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు వర్షాకాలంలో అనారోగ్య సమస్యలకు గురవుతారు. అయితే జ్వరం వచ్చిన ప్రతిసారీ మన పెద్దలు లేదా స్నేహితులు స్నానం చేయకూడదని సలహా ఇస్తూ ఉంటారు. అయితే ఇది నిజమా.. కాదా తెలుసుకుందాం. ఈ పాత నమ్మకం వెనుక ఉన్న వాస్తవం ఏమిటి? జ్వరం ఉన్నప్పుడు ఏ రకమైన స్నానం మేలు చేస్తుంది? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

- Advertisement -

ఉష్ణోగ్రత సమతుల్యత : జ్వరం వచ్చినప్పుడు శరీరం వేడిగా, అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో స్నానం చేయడం అనేది కేవలం పరిశుభ్రత కోసమే కాదు. శరీరాన్ని రిఫ్రెష్ చేయడానికి కూడా సహాయపడుతుంది. వాస్తవం గా చెప్పలి అంటే స్నానం చేయకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత సమతుల్యత చెందుతుంది తప్పా ఎలాంటి నష్టం ఉండదు.

అసలు చేయవలసినది ఏమిటి: జ్వరం ఉన్నప్పుడు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. స్నానం చేయడం వల్ల జ్వరం కారణంగా వచ్చే అలసట, ఒళ్లు నొప్పులు మరియు చిరాకు తగ్గుతాయి. అంతే కాకుండా పరిశుభ్రత వల్ల మానసికంగా కూడా రిఫ్రెష్‌గా అనిపిస్తుంది. అయితే చల్లని నీటితో స్నానం చేయకపోవడమే మంచిది. ఎందుకంటే చల్లని నీటి ద్వారా శరీరంలో వణుకు మొదలై.. జ్వరం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

Also Read: https://teluguprabha.net/lifestyle/difference-between-king-cobra-speed-and-human-speed/

ఎక్కువసేపు స్నానం: జ్వరంగా ఉన్నప్పుడు ఎక్కువసేపు స్నానం చేయకూడదు. త్వరగా స్నానం ముగించాలి. అంతేకాకుండా పొడి తవల్ తో శుభ్రంగా తుడుచుకుని.. వెచ్చని దుస్తులు ధరించాలి. అంతేకాకుండా జ్వరం మరీ ఎక్కువగా ఉంటే గోరువెచ్చని నీటితో తడిపిన గుడ్డతో శరీరాన్ని తుడిస్తే సరిపోతుంది.

జ్వరం ఉన్నప్పుడు స్నానం చేయకూడదు అనే నమ్మకం అశాస్త్రీయమైనది. ఎందుకంటే అసౌకర్యంగా అనిపించినప్పుడు, భయం లేకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శారీరక, మానసిక ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జ్వరం నియంత్రణకు పరోక్షంగా సహాయపడుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad