Jamun Benefits For Diabetes: ప్రస్తుతం డయాబెటిస్ అనేది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చేస్తున్న ఒక సాధారణ సమస్య. ఈ సమస్యతో బాధపడేవారు ఆహారం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షుగర్ కలిగిన ఆహార పదార్థాలు తినడం వల్ల సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. కాబట్టి పోషకరమైన ఆహారం, పీచు అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవడం ముఖ్యం. అయితే కొన్ని రకాల పండ్లు కూడా డయాబెటిస్ వ్యాధికి సహాయపడుతాయని వైద్యులు చెబుతున్నారు. అందులో నల్ల నేరేడు పండు ఒకటి. ఈ పండును బ్లాక్ ప్లం అని కూడా పిలుస్తారు. ఇది వేసవి చివరిలో లభిస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు ఈ పండు తినడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు గురించి మనం తెలుసుకుందాం.
డయాబెటిస్ VS నేరేడు పండు:
❈ నేరేడు పండులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరచుతుంది. కాబట్టి డయాబెటిస్‌తో బాధపడేవారు నల్ల నేరేడు పండును ఆహారంలో చేర్చుకోవడం మంచిది. నేరేడు పండులో జాంబోలిన్, జాంబోసిన్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ను తగ్గిస్తాయి.
❈ నేరేడు పండులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీని ప్రతిరోజు తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల బారిన పడకుండా ఉంటారు.ఇందులో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది అతిగా తినకుండా చేస్తుంది. దీని వల్ల బరువు పెరగకుండా ఉంటారు. ఆరోగ్యనిపుణుల ప్రకారం ఊబకాయం డయాబెటిస్‌కు ప్రమాదకరమైనది. ఈ సమస్య బారిన పడకుండా ఉండాలంటే బరువు తగ్గడం లేదా నియంత్రణలో ఉంచడం ముఖ్యం.
❈ నల్ల నేరేడు పండు లేదా నేరేడు పండులో యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇది ఒత్తిడి పెరగకుండా , కంటి సమస్యలు రాకుండా చేస్తుంది. ముఖ్యంగా నరాల బలహీనత సమస్యకు, మూత్రపిండ సమస్యల నుంచి రక్షిస్తుంది. డయాబెటిస్ రోగులు రోజు రెండు నేరేడు పండ్లు తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ పండులో విటమిన్ సి,ఎ, పొటాషియం, కాల్షియం, ఐరన్ ఇతర పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ఇవి ఎముకలను దృఢంగా తయారు చేయడంలో కీలక ప్రాత పోషిస్తాయి.
నేరేడు పండు డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఈ లాభాలు లభిస్తాయి. కాబట్టి డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు దీని తినడం చాలా ముఖ్యం. అయితే ఏదైనా కొత్త ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోనే ముందు వైద్యుడి సలహా తీసుకోవడం ముఖ్యం. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన సలహాలు ఇవ్వగలరు.