Sunday, February 8, 2026
Homeలైఫ్ స్టైల్Billionaires: పేరుకే బిలియనీర్లు..కానీ, ఏం తింటున్నారో తెలుసా..?

Billionaires: పేరుకే బిలియనీర్లు..కానీ, ఏం తింటున్నారో తెలుసా..?

Billionaires Diet: ప్రతి పూట మెష్లిన్ స్టార్ చెఫ్ వంటలు తినే స్థోమత ఉన్న ఆగర్భ శ్రీమంతులు నిత్యం ఏం తింటున్నారో తెలుసా? ప్రైవేటు చెఫ్ లున్న బిలియనీర్లు తమ ఆహారపు అలవాట్లు మాత్రం పెద్దగా మార్చుకోలేకపోగా తమకు నచ్చినప్పుడు నచ్చినవి తినేస్తూ సంపాదనపై ఫోకస్ సడలకుండా జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. స్ట్రిక్ట్ డైట్స్, వైరల్ ఫుడ్ ట్రెండ్స్ ను ఏ మాత్రం కేర్ చేయని కుబేరులు అత్యంత సాధారణమైన ఆహారాన్ని ఆస్వాదిస్తుండటం విశేషం.

- Advertisement -

కొందరు బిలియనీర్లు చాలా సాదాసీదాగా యువకులు తిన్నట్టు నచ్చినది నచ్చినప్పుడు తినేస్తుంటే, మరికొందరేమో చాలా స్ట్రిక్ట్ గా సింపుల్ ఫుడ్ అది కూడా ఇంట్లో వండినది మాత్రమే లాగించేస్తున్నారు. ప్రపంచంలో ఆగర్భ శ్రీమంతుల ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయనేది అందరికీ ఆసక్తికరమైన విషయం. రోజూ కోట్లలో ఆర్జించే వీరు ప్రతి పూట ఏం తింటారని కామన్ మ్యాన్ కి తెలుసుకోవాలని ఆరాటం ఉంటుంది.

వారెన్ బఫెట్

చిన్నప్పటి నుంచీ తాను తింటున్న మెనూనే ఇప్పటికీ వారెన్ బఫెట్ ఎంజాయ్ చేయటం రొటీన్ అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. టీనేజ్ నుంచి తాను అత్యంత ఇష్టంగా తినే ఆహారాన్నే 90 ఏళ్లు దాటినా వారెన్ బఫెట్ తింటున్నారు. మ్యాక్ డొనాల్డ్స్ బ్రేక్ ఫాస్ట్ ను రోజూ తినే ఈయన స్టాక్ మార్కెట్ పరిస్థితిని బట్టి చెర్రీ కోర్ రోజూకు 2 లీటర్ల వరకు తాగేస్తారు. ఉప్పు తక్కువ తినకపోవటం ఈయన ప్రత్యేకత. డైరీ క్వీన్ అంటే తనకు ఆల్ టైం ఫేవరెట్ అనే వారెన్ స్పెషల్ గా ఏమీ తినకపోగా ఆరోగ్యంగా ఉంటూ, భారీగా పెట్టుబడులు పెడుతూ లాభాలు ఆర్జిస్తున్నారు.

 

బిల్ గేట్స్

బిల్ గేట్స్ డైట్ అయితే ఇంకా చాలా సింపుల్ డైట్ ఫాలో అవుతారు. డైట్ కోక్, బర్గర్స్ తో జీవితం గడిపేసేలా గేట్స్ మెనూ ఉండటం విచిత్రం. వారెన్ బఫెట్ లానే ఈయన కూడా ఫాస్ట్ ఫుడ్ తినేస్తారు. చీజ్ బర్గర్స్ ఆయనకు ఎప్పటి నుంచో ఫేవరెట్. మరోవైపు డైట్ కోక్ క్యాన్స్ అయితే ఖాళీ అవుతూనే ఉంటాయి. ఇక ప్రయాణంలో ఉన్నప్పుడు డైట్ కోక్ క్యాన్స్ ఇంకా ఎక్కువ తాగుతారు. కొత్త రకాల ఆహారాన్ని ట్రై చేసే గేట్స్ రోజూ మాత్రం ఈ డైట్ నే హ్యాపీగా తినేస్తారు. మీటింగుల మధ్య పరుగులు పెట్టే బిజీ బిజినెస్ మ్యాన్ అయిన గేట్స్ సింపుల్ గా తినేసి పనిమీదే ఫోకస్ పెడుతుంటారు.

ముఖేష్ అంబానీ

సంప్రదాయ ఆహారం, శాకాహారం, ఇంట్లో వండిన ఆహారం తినేసి హ్యాపీగా పనిచేసుకోవటం ముఖేష్ అంబానీకి అలవాటు. గుజరాతీ భోజనం ఇష్టంగా తింటారు. బియ్యం పిండితో చేసే పంకి అనే గుజరాతీ వంటకం ముఖేష్ కు అత్యంత ఇష్టమైన ఫుడ్. దక్షిణాది వంటకాలైన దోస, ఇడ్లీ-సాంబార్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతకు ఇష్టం. పోషకాలు, సమతుల్య ఆహారాన్ని మాత్రమే ఈయన రోజూ తీసుకోవటం విశేషం.

also read:Carnivore Diet: కార్నివోర్ డైట్ ఏంటి ఏమిటి..? ఇందులో ఏమేం ఉంటాయి..? ఫాలో అవుతే మంచిదేనా..?

జెఫ్ బెజోస్

పవర్ బ్రేక్‌ఫాస్ట్‌, లీన్ ప్రొటీన్స్ తన రెగ్యులర్ డైట్ గా మార్చుకున్న అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ మొదట్ లో హై క్యాలరీ ఫుడ్ ను ఇష్టంగా తినేవారు. మంచి రుచులను బాగా ఆస్వాదించే తత్వమున్న జెఫ్ బెజోస్ ఆతరువాతి కాలంలో చాలా సింపుల్ గా అదికూడా క్లీన్ డైట్ ను అలవాటు చేసుకున్నారు. మెడిటరేనియన్ ఆక్టోపస్ విత్ యోగర్ట్ ఎక్కువగా ఆరగించే బెజోస్ ఉదయం మాత్రం హై ఎనర్జీ మార్నింగ్స్ కు ప్రాధాన్యత ఇచ్చేలా మంచి పోషకాలతో నిండిన బ్రేక్‌ఫాస్ట్‌ తింటానని వివరించారు.

ఎలాన్ మస్క్

ఎలాన్ మస్క్ రూటే సపరేట్ కదా. తిండి, తినటంలోనూ కూడా అంతే! జస్ట్ బతకడానికి తిండి తినాలంతే అనే తత్వాన్ని ఫాలో అయ్యే ఈయన ఒక్కోసారి పనిలో పడి తినటం కూడా మర్చిపోతానని చెబుతారు. తిండి అనేది పెద్ద ఆటంకమే కానీ సంతోషాన్ని ఇవ్వదని మస్క్ సరదాగా చెబుతుంటారు. స్టీక్స్, బేసిక్ మీల్స్ మాత్రమే తీసుకుని ఎలాన్ మస్క్ చాలా అరుదుగా మంచి ఆహారాన్ని తీసుకుంటారు. ఆల్కహాల్ కు దూరంగా ఉండే ఈయన అప్పుడప్పుడు రెడ్ వైన్ ట్రై చేస్తుంటారు.

రిచర్డ్ బ్రాన్సన్

మరో ప్రపంచ కుబేరుడుగా ఎంతోమంది కుబేరులకు రిచర్డ్ బ్రాన్సన్ రోల్ మోడల్ ఫుడ్ విషయానికి వస్తే ఈయన ఏం తింటారు అనటం కంటే ఏం తాగుతారు అనేదే చెప్పుకోవాలి. వర్జిన్ గ్రూప్ ఫౌండర్ అయిన రిచర్డ్ రోజుకు ఏకంగా 20 కప్పులకు పైగా టీ తాగేస్తారు. చాలా ఆరోగ్యంగా, ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే ఈయన బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ యాక్టివ్ లైఫ్ స్టైల్ ఫాలో అవుతూనే టీ ఎక్కువ ఎంజాయ్ చేయటం హైలైట్. టీ అంటే ఓ సంప్రదాయం, ఓ ఇంధనం లాంటిదని ఆయనే సరదాగా చెబుతుంటారు.

ఏం తినాలి? ఎంత మంచి, ఎంత రిచ్ ఫుడ్ తినాలి? ఇవి కావు బిలియనీర్లను నడిపే చోదక శక్తులు. ప్రపంచ అపర కుబేరులు ఏ వయసు వారైనా తినటానికి అత్యధిక ప్రాధాన్యత, సమయం అస్సలు వెచ్చించకపోగా చాలా సింపుల్ గా తినటంతో ఈ తంతును ముంగించామనిపిస్తారు. డిజైనర్ డైట్స్, ఎగ్జాటిక్ సూపర్ ఫుడ్స్, ఫుడ్ ట్రెండ్స్ ఇలాంటి బిలియనీర్లను అస్సలు ఆకట్టుకోవు. ప్రభావితం చేయవు. ఎమోషనల్ కంఫర్ట్, మెంటల్ ఎనర్జీ అత్యద్భుతంగా ఉంటేనే వ్యాపారంలో దూసుకుపోగలమని వీరికి బాగా తెలుసు. అందుకే వీరికి తిండి పై అంత ఆసక్తి ఉండదు. తిండి ప్రియులు కాకపోవటం వీరి అతిపెద్ద బలం అని చెప్పవచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News