Leg Swelling Trouble కాళ్లవాపు సమస్య ఈ రోజుల్లో చాలా కామన్‌గా మారింది. కొంతమంది చిన్న చిన్న పనులకే కాళ్లు వాపెక్కి ఇబ్బందిపడుతుంటారు. గర్భిణీల్లో అయితే ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది. అయితే కాళ్లు వాపులు రావడానికి ప్రధాన కారణం ఎక్కువ సేపు నిలబడటం, అధికంగా నడవడం, ఎక్కువ సేపు కూర్చోవడంతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల ఈ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మనకు సులభంగా ఇంటిలోనే లభించే వాటితో కొన్ని రకాల చిట్కాలను పాటించి ఈ సమస్యకు చెక్ పెట్టొట్టు మరి అవేంటో తెలుసుకుందామా
1.నిమ్మరసం తాగండి
నిమ్మరసం శరీరానికి ఎంతో మేలు చేస్తోంది. రోజూ నిమ్మరసం తాగడం వల్ల పాదాల్లో వాపుని తగ్గించవచ్చు. శరీరంలోని ట్యాక్సిన్స్, అదనపు ద్రవాలను తొలగించడానికి నిమ్మరసం చక్కని ఔషధంలా పనిచేస్తుంది. కనుక రోజూ లెమన్ వాటర్ తాగడం వల్ల కాళ్ల వాపు చాలా వరకూ తగ్గే అవకాశం ఉంది. దానితో పాటు నిమ్మరసం వల్ల శరీరానికి మరెన్నో ఉపయోగాలున్నాయి.
2.అధికంగా నీరు తీసుకొండి
కొన్ని కొన్ని సార్లు పాదాల్లో నీరు నిలిచిపోయినప్పుడు పాదాలు వాపు వచ్చే అవకాశం ఉంది. కనుక దానిని నివారించాలంటే నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అలా చేయడంతో పాదాల్లో నిలిచిపోయిన నీరు పూర్తిగా బయిటకి వెళుతుంది. అధికంగా నీరు తీసుకుంటే శరీరంలో కిడ్నీల్లో రాళ్ల సమస్యలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతోంది. జీర్ణక్రీయ సరిగ్గా ఉంటుంది.
3.ఉప్పు మంచి చిట్కాగా పనిచేస్తోంది.
పాదాల్లో వాపు తగ్గడానికి మనం వంటల్లో వాడే ఉప్పు ఒక మంచి రెమిడీ. దీనికోసం ముందుగా నీటిని గోరు వెచ్చగా వేడి చేయండి. అనంతరం అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మిక్స్ చెయ్యండి. ఆ నీళ్లలో కొద్దిసేపు కాలు పెట్టి ఉంచండి. ఇలా చేయడం వల్ల కాళ్లవాపులు దూరం అవడంతో పాటు కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వీటిని పాటిస్తే మంచి ఫలితం ఉంటుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
4.ఐస్ ప్యాక్‌ని వాడండి
పాదాల వాపు తగ్గడానికి ఐస్ ప్యాక్ సైతం మంచి ఉపయోగకరంగా ఉంటుంది. దీనికోసం ఐస్‌ని కాటన్ క్లాత్‌లో చుట్టి పాదాల్లో వాపు ఉన్న చోట ఒత్తుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల పాదాల్లో ఉండే వాపులు, నొప్పులు పూర్తిగా దూరం అవుతాయి. అంతే కాకుండా పాదాలకు మంచి ఉపశమనం లభిస్తోంది.
ఇవండీ మీకాళ్ల వాపుని తగ్గించడానికి నిపుణులు సూచించిన చిట్కాలు. వీటిని పాటించి మీ కాళ్ల వాపు సమస్య నుంచి మంచి ఉపశమనం పొందండి.


