Love vs Infatuation: మనిషి జీవితంలో బంధాలు, అనుబంధాలకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ‘ప్రేమ’ అనే రెండక్షరాల పదం జీవితాన్ని స్వర్గంగా మార్చగలదు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది తాత్కాలిక భావోద్వేగాలను, ఆకర్షణను ప్రేమని పొరబడుతూ తర్వాతి కాలంలో మానసిక వేదనకు గురవుతున్నారు. నిజమైన ప్రేమకు, కేవలం భ్రమలకు మధ్య ఉన్న తేడాలను మానసిక నిపుణులు ఈ విధంగా విశ్లేషిస్తున్నారు.
తాత్కాలిక భావోద్వేగాలు ప్రేమ కాదు: కొందరు వ్యక్తులు సందర్భాన్ని బట్టి విపరీతమైన ప్రేమను కురిపిస్తారు. అవతలి వ్యక్తి కష్టాల్లో ఉన్నప్పుడు అతిగా స్పందించి.. ఆ సమస్య తీరగానే ముఖం చాటేస్తారు. ఇది కేవలం ఒక ఎమోషనల్ డ్రామా మాత్రమే. స్థిరత్వం లేని ఆలోచనలు, అసూయ, అతిగా స్పందించడం ప్యాషనేట్ లవ్ అనిపించుకోదు. ఇలాంటి ప్రవర్తన వల్ల భాగస్వామి మానసికంగా అలసిపోయే ప్రమాదం ఉంది.
Also read-Sankranti Tips : సంక్రాంతి స్పెషల్.. ఇంట్లోనే పార్లర్ గ్లో.. ఇలా ట్రై చేయండి.!
బహుమతులు, ప్రదర్శనల వెనుక: సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో.. ఖరీదైన గిఫ్ట్‌లు, గ్రాండ్ సెలబ్రేషన్లు, సర్ ప్రైజ్‌లు ఉంటేనే అది ప్రేమని చాలామంది భావిస్తున్నారు. కానీ పైకి కనిపించే ఆడంబరం కంటే లోపల ఉండే నమ్మకం ముఖ్యం. నిరంతరం ఒకరిపై ఒకరు కేర్ తీసుకోవడం, నిజాయితీతో కూడిన సంభాషణే బంధాన్ని నిలబెడుతుంది. ప్రదర్శన కోసం చేసే ప్రేమ ఎక్కువ కాలం నిలవదు.
వ్యక్తిత్వాన్ని కోల్పోవద్దు: ప్రేమ పేరుతో తనను తాను పూర్తిగా మార్చుకోవడం, తన ఆసక్తులను, నైతిక విలువలను వదులుకోవడం కొందరు త్యాగమని భావిస్తారు. కానీ ఇది అనారోగ్యకరమైన లక్షణం. మీ భాగస్వామి మిమ్మల్ని కంట్రోల్ చేయడం లేదా మీ అభిప్రాయాలను అణచివేయడం ప్రేమ కాదు. ఆరోగ్యకరమైన బంధంలో ఇద్దరికీ సమాన గౌరవం, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలి.
Also read-LifeStyle: మౌనం శక్తివంతమైన సోపానం.. సృజనాత్మక శక్తికి దోహదం.!
నిబంధనల పేరుతో అణచివేత: సాంప్రదాయాలు లేదా సామాజిక నిబంధనల పేరుతో భాగస్వామిపై కఠినమైన రూల్స్ పెట్టడం వారి స్వతంత్రతను దెబ్బతీస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉండటమే నిజమైన అనుకూలత. అంతేగానీ భాగస్వామిని ఒక ఐడియల్ బొమ్మలా మార్చాలని చూడటం సరికాదని మానసిక నిపుణులు పేర్కొన్నారు.
ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకోవడం ముఖ్యం: చాలామంది రిలేషన్‌షిప్‌లో గొడవలు ఎందుకని సమస్యల గురించి మాట్లాడటం మానేస్తారు. ఎదుటి వ్యక్తి బాధపడతారనో లేదా బంధం చెడిపోతుందనో నిజాలు దాచడం వల్ల భవిష్యత్తులో అది పెను ప్రమాదానికి దారితీస్తుంది. మనసులోని అసంతృప్తిని బయట పెట్టకపోవడం వల్ల ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. భాగస్వామి తప్పు చేసినా ప్రశ్నించకపోవడం మెచ్యూరిటీ అనిపించుకోదు. నిజమైన ప్రేమలో పారదర్శకత, నమ్మకం మరియు గౌరవం ఉంటాయి. కేవలం ఆకర్షణకు, భ్రమలకు లోనై జీవితాన్ని సంక్లిష్టం చేసుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. సమస్యలను ఓపెన్‌గా చర్చించుకోవడం, ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు గౌరవించుకోవడం ద్వారానే రిలేషన్‌షిప్‌లో ఆనందంగా ఉండగలమని మానసిక నిపుణులు తెలిపారు.

