Lucky Moles Female: శరీరంలోని కొన్ని భాగాలపై పుట్టు మచ్చలు ఉండడం సహజం. అయితే కొందరు శుభంగా.. మరికొందరు అశుభంగా భావిస్తారు. సముద్ర శాస్త్రం ప్రకారం.. ఏఏ శరీర భాగాలపై పుట్టుమచ్చలు ఉంటే అదృష్టం వస్తుందో తెలుసుకుందాం.
చెంపలపై పుట్టు మచ్చ ఉంటే చాలా అదృష్టమట. ఇక్కడ మచ్చ ఉన్న వ్యక్తులు ఎల్లప్పుడూ సంతోషంగానే ఉంటారట. మరీ ముఖ్యంగా ఎడమ చెంపపై పుట్టుమచ్చ ఉంటే అదృష్టం వెతుక్కుంటూ రావడంతో పాటు ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయట.

మగవారైనా..ఆడవాళ్లైన తమ ఛాతీ మధ్యలో పుట్టు మచ్చ కలిగిన వ్యక్తులు అదృష్టవంతులుగా భావిస్తారట. అలాంటి వాళ్లకు జీవితంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే బొడ్డుపై లేదా బొడ్డు చుట్టూ పుట్టుమచ్చ ఉంటే దాన్ని శుభ సంకేతంగా భావిస్తారు.

సముద్ర శాస్త్రం ప్రకారం.. నుదుటిపై పుట్టుమచ్చలు ఉంటే వాటిని చాలా శుభప్రదంగా భావిస్తారట. ఇలాంటి వ్యక్తులకు ధనం కొరత ఎప్పుడూ ఉండదట. గొంత దగ్గర పుట్టుమచ్చ ఉన్నా శుభమే కలుగుతుందట.
అదే విధంగా ముక్కుపై పుట్టుమచ్చ ఉన్న వాళ్లు బాగా సంపాదిస్తారట. ఆర్థిక సమస్యలు చాలా అరదు. చివరిగా అరచేతిలో పుట్టుమచ్చ ఉంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సు ఇస్తుందట.


