Thursday, July 10, 2025
Homeలైఫ్ స్టైల్Mint Pulao Recipe: రాత్రి మిగిలిపోయిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్..తయారు చేసే విధానం...

Mint Pulao Recipe: రాత్రి మిగిలిపోయిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్..తయారు చేసే విధానం ఇదే..

Mint Pulao Recipe: రాత్రి భోజనం చేసిన తర్వాత అందరి ఇంట్లో తరచుగా కొంచెం అన్నం మిగిలిపోతుంది. ఇటువంటి పరిస్థితిలో చాలా మంది దానిని ఫ్రైడ్ రైస్ చేసుకొని తిందాం అనుకుంటారు. మరికొందరు అయితే ఉదయం వండిన పప్పు లేదా ఇతర కూరగాయలతో దాని తినేదాం అనుకుంటారు. కానీ, నిజానికి వారు మిగిలిపోయిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడరు. దీంతో తినకుండా మిగిలిన ఆహారాన్ని చెత్తబుట్టలో వేస్తారు. అయితే, రాత్రి మిగిలిపోయిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్ లేదా పుదీనా రైస్ తయారు చేయవచ్చని మీకు తెలుసా? ఇప్పుడు మిగిలిపోయిన అన్నంతో రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్ ఎలా చేసుకోవాలి? దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మసాలా పేస్ట్ కోసం కావాల్సిన పదార్థాలు

తగినంత పుదీనా
సరిపడా కొత్తిమీర
3 – వెల్లుల్లి
1- అంగుళం అల్లం
2- మిరపకాయలు
¼ ఉల్లిపాయ
2 టేబుల్ స్పూన్లు కొబ్బరి తరుగు
1 స్టార్ సోంపు
2- ఏలకులు
5- లవంగాలు
½ అంగుళం దాల్చిన చెక్క
అరటీస్పూన్ నల్ల మిరియాలు

పులావు కోసం కలవాల్సిన పదార్థాలు

రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి
ఒకటీస్పూన్ స్పూన్ జీలకర్ర
1 బే ఆకు
10 జీడిపప్పు
1 ఉల్లిపాయ తరుగు
1 టమోటా తరుగు
½ బంగాళాదుంప, చిన్న ముక్కలుగా కట్ చేయాలి
½ క్యాప్సికమ్ తరుగు
½ క్యారెట్ తరుగు
2 టేబుల్ స్పూన్లు బఠానీలు
5 బీన్స్ తరుగు
2 కప్పుల నీరు
1 స్పూన్ ఉప్పు
రాత్రి మిగిలిన రైస్

తయారీ విధానం:

  • రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్ తయారీ కోసం ముందుగా తగినంత పుదీనా, కొత్తిమీర తీసుకోవాలి. తరువాత వీటిని ఒక చిన్న బ్లెండర్‌లో వేయాలి. ఇప్పుడు అందులో వెల్లుల్లి, అల్లం, మిరపకాయలు, ఉల్లిపాయ, కొబ్బరి తరుగు వేసి కలపాలి.
  • అలాగే ఇందులో ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు కూడా వేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో అవసరానికి అనుగుణంగా నీరు పోసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తయారు చేసి పక్కనపెట్టుకోవాలి.
  • అనంతరం స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక జీలకర్ర, బే ఆకులు వేయాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. అలాగే టమోటాలు తరుగు కూడా వేసి అవి మెత్తబడే వరకు కలుపుతూ ఉండాలి.
  • దీని తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసిన బంగాళాదుంపలు, క్యాప్సికమ్ తరుగు, క్యారెట్లు తరుగు, బఠానీలు, బీన్స్ ఇలా ఒక్కఒకటిగా వేసి దాదాపు 2 నిమిషాలు పాటు ఉడికించాలి.
  • అనంతరం పక్కనపెట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసి బాగా కలపాలి. తరువాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి. కాసేపు తరువాత ఇందులో రాత్రి మిగిలిన రైస్ వేసి బాగా కలపాలి. ఇలా దాదాపు 2 నిమిషాలపాటు అంత కలిసేలా ఈ రైస్ ను హై ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా కలపాలి. అంతే రెస్టారెంట్ స్టైల్ పుదీనా పులావ్ మీ ముందు ఉంటుంది. దీని ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News