Marriage relationship strengthening tips: భార్యాభర్తల బంధం మూడు ప్రధాన అంశాలై ఆధారపడి ఉంటుంది. ప్రేమ, నమ్మకం, గౌరవం అనే ముల స్తంభాలే ఏ బంధాన్ని అయినా పటిష్టం చేస్తుంది. ముఖ్యంగా వివాహ బంధంలో ఇవి ఉండాల్సిందే. ఈ అనుబంధంలో చిన్న చిన్న గొడవలు అలాగే విభేదాలు సహజమే అయినప్పటికీ కొన్ని మాటలు మాత్రం పదేపదే గాయం చేసి వారి మధ్య దూరాన్ని పెంచుతాయి. ముఖ్యంగా భార్యలు కోపంలోనో లేదా నిస్సహాయతతోనో మాట్లాడే కొన్ని మాటలు భర్తల మనసును తీవ్రంగా బాధపెడతాయి. ఏ భార్య కూడా కావాలని ఇలాంటి మాటలు చెప్పకపోయినా.. అవి సంబంధాన్ని దెబ్బతీస్తాయి. భర్త ఆత్మవిశ్వాసంతో పాటు ఆనందాన్ని దెబ్బతీసి.. వారిద్దరి మధ్య అగాధాన్ని సృష్టించే భార్య మాట్లాడే ఐదు ముఖ్యమాటలు ఏంటో ఇప్పుడు చూద్దాం:
మీరు ఏ పనికి సరిపోరు: ఒక వ్యక్తి తన కుటుంబాన్ని ఆర్థికంగాను అలాగే మానసికంగా బలంగా నిలబెట్టాలని కోరుకుంటాడు. అలాంటి సమయంలో “మీరు ఏ పనికి సరిపోరు” అనే మాట భర్త ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. వారి ప్రయత్నాలను మరియు కష్టాన్ని తక్కువ చేసి చూపిస్తే మనసులో తీవ్రమైన బాధను కలిగిస్తుంది.
Also Read:https://teluguprabha.net/lifestyle/the-secret-qualities-of-guys-to-attracting-women/
మీ తల్లిదండ్రులు మాట వినొద్దు: పెళ్లయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ తమ తమ కుటుంబాల గౌరవాన్ని కాపాడాలని అనుకుంటారు. కానీ భర్త తమ తల్లిదండ్రుల పట్ల చూపించే ప్రేమను మరియు బాధ్యతను ప్రశ్నిస్తూ.. “మీరు ఎప్పుడూ మీ తల్లిదండ్రుల మాటే వింటారు” అంటూ తప్పు పడితే అది భర్త మనసును గాయపరుస్తుంది. ఈ పరిస్థితి తల్లిదండ్రులకు, భార్యకు మధ్య ఎవరిని ఎంచుకోవాలో తెలియని అయోమయాన్ని సృష్టిస్తుంది.
ఇతరులతో పోల్చడం: అతన్ని చూసి నేర్చుకోండి..మీరు వాళ్లలా ఎందుకు ఉండలేరు లాంటి మాటలు భర్తను గాయపరుస్తుంది. ప్రతి వ్యక్తికి ప్రత్యేకమైన సామర్థ్యాలతో పాటుగా లోపాలు ఉంటాయి. ఇతరులతో పోల్చి చూడడం వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూసినట్లు అవుతుంది. ఈ పోలిక భర్తలో నిరాశతో పాటుగా అసమర్థత అనే భావనను పెంచుతుంది.
Also Read:https://teluguprabha.net/lifestyle/how-to-manage-depression-and-stay-fit-after-a-breakup/
మీరు నాకు ఏమీ ఇవ్వలేరు: ఇది ఆర్థికపరమైన విషయం. కోపంలో లేదా నిరాశతో భార్యలు ఈ మాటను పలికినప్పుడు అది భర్తపై తీవ్ర ప్రభావం చూపుతుంది. తాను తన కుటుంబానికి అవసరమైనవన్నీ అందించడంలో విఫలం అయ్యాననే భావన భర్తలో తీవ్రమైన బాధను కలిగిస్తుంది.
మీరు మారరు: సంబంధంలో సమస్యలు ఎదురైనప్పుడు పరిష్కరించడానికి ఇద్దరూ కలిసి ప్రయత్నించాలి. కానీ మీరు మారరు లాంటి మాటతో భార్య ఆ ప్రయత్నాన్ని ముందే అడ్డుకుంటుంది. ఈ మాట భర్తపై తమకు నమ్మకం లేదని సూచిస్తుంది. ఇది భర్తలోని నిస్సహాయత భావాన్ని పెంచుతుంది.
పరిష్కారం: ఈ ఐదు మాటలు భార్యలు కోపంలో పలికితే అవి భర్తల మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. నేటి కాలంలో జంటలు తొందరగా విడిపోవడానికి కూడా కారణమవుతున్నాయని పలువురు విశ్లేషకులు తెలిపారు. బంధంలో గౌరవం, పరస్పర అవగాహన చాలా ముఖ్యమని అంటున్నారు. కాబట్టి భార్యాభర్తలిద్దరూ ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అత్యంత జాగ్రత్త వహించాలి. చిన్నపాటి ప్రశంసలతో పాటుగా ప్రేమతో కూడిన మాటలు వారి అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి.అందుకే చిన్నచిన్న గొడవలకే సమస్యను పెద్దది చేసుకోకుండా ప్రేమతో కలిసి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.


