Messy Jewellery Trend: ఫ్యాషన్ వల్డ్ లో ఇప్పుడు మెస్సీ జువెలరీ ట్రెండ్ దే హవా. రకరకాల నెక్లెస్లు, చైన్లను చిందరవందరగా మెడ నిండా ధరించటమే మెస్సీ జువెలరీ ట్రెండ్. చిందరవందరగా ఉన్నా అందంగా కనిపించటం ఈ మెస్సీ జువెలరీ ట్రెండ్ విశిష్టత. చైన్లు, ముత్యాలు, పూసలు, స్టోన్లు వంటివన్నీ లేయరింగ్ లా వేసేసుకోవటంతో కొత్త లుక్ వస్తుంది. ఇంకా చెప్పాలంటే గోల్డ్, సిల్వర్, ఇమిటేషన్ జువెలరీ, బీడ్స్ అన్నీ కలిపి వేసేసుకోవటంతో మెడ సరికొత్తగా కనిపించేలా చేస్తుంది. ఇదో స్టేట్‌మెంట్ ఫ్యాషన్ స్టైల్ లా కనిపిస్తుంది. మీకు నచ్చిన ఆభరణాలన్నీ కలిపి ధరించేయటమే ఇందులో ఉన్న సౌలభ్యం. మ్యాచింగ్, స్టైల్స్ అనేవి పట్టించుకోకుండా ఇలా మెస్సీ జువెలరీ ట్రెండ్ తో క్యాట్ వాక్ చేయటం లేటెస్ట్ స్టైల్.
Also Read: Ganja Seizure: ఖమ్మంలో భారీగా గంజాయి పట్టివేత.. 15.7 కేజీల గంజాయి స్వాధీనం


