Homeలైఫ్ స్టైల్Micro French manicure trend: మైక్రో ఫ్రెంచ్ మానిక్యూర్ ట్రెండ్

Micro French manicure trend: మైక్రో ఫ్రెంచ్ మానిక్యూర్ ట్రెండ్

Micro French manicure trend: మానిక్యూర్ ట్రెండ్లపై మనసుపారేసుకునేవారి సంఖ్య రోజురోజుకూ అసంఖ్యాకంగా పెరుగుతోంది. అందుకే మానిక్యూర్ సర్వీసులు, ట్రెండ్లకు ఫుల్ గిరాకీ వచ్చిపడుతోంది. క్లాసిక్ మానిక్యూర్ కు ట్రెండింగ్ కలర్స్ తో సరికొత్త సొబగులు అద్దే ట్రెండ్లలో మినిమలిస్టులకు నచ్చే స్టైల్స్ చాలా తక్కువ. అలాంటి వాటిలో మైక్రో ఫ్రెంచ్ మానిక్యూర్ ట్రెండ్ బాగా ఆకట్టుకుంటోంది. నిజానికి ఇది ఫ్రెంచ్ నెయిల్ ఆర్ట్ కు ఆధునిక రూపం కనుకనే ఫ్రెంచ్ మానిక్యూర్ అంటారు. కేవలం గోరు చివరన మాత్రమే నెయిల్ ఆర్ట్ వేయటంతో చాలా సింపుల్, డీసెంట్, డిగ్నిఫైడ్ గా గోర్లు సరికొత్త అందాన్ని సంతరించుకుంటాయి. ఒక మిమీ లేదా అంతకంటే తక్కువ మందంతో నెయిల్ పాలిష్ వేయటం హైలైట్ లుక్ ను తెచ్చిపెడుతుంది. ఇది చాలా సహజమైన లుక్ ను ఇస్తుంది కనుక అన్ని వయసులవారు ఈ సింపుల్ ట్రెండ్ ను ఇష్టపడుతున్నారు. ఇందులో న్యూడ్ బేస్, మెటాలిక్ తో పాటు ఎన్నో రంగులతో ప్రయోగాలు చేయవచ్చు.

- Advertisement -

Also Read: Clothes: బట్టలు అవే.. లుక్‌ మారే!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News