ఏలూరు (తెలుగుప్రభ): మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఏలూరు షోరూంలో ‘నెక్లెస్ ఫెస్టివల్ షో’ గురువారం ఘనంగా జరిగింది. ఈ నెల 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఈ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ‘షో ద వే’ ఇతివృత్తంతో ఈ షోలో వివిధ సంస్కృతులు, సంప్రదాయాలకు అనుగుణంగా నవ వధువుల కోసం రూపొందించిన ప్రత్యేక ఆభరణాల సేకరణలను ప్రదర్శిస్తున్నారు.
భారతీయ వారసత్వ ఆభరణాల బ్రాండ్ ‘డివైన్’, వజ్రాభరణాల బ్రాండ్ ‘మైన్’, అన్‌కట్’ వజ్రాభరణాల బ్రాండ్ ‘ఎరా’ వంటి కలెక్షన్లు కూడా ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయని షోరూం నిర్వాహకులు తెలిపారు. వన్ ఇండియా గోల్డ్ రేట్ విధానంలో దేశవ్యాప్తంగా తమ షోరూమ్‌లలో ఒకే ఉత్తమ ధరను వన్‌ట్లు ప్రసిద్ది చెందింది. గడియారానికి పారదర్శక ధరల పట్టిక, జీవితకాల ఉచిత నిర్వహణ, పాతపై 100 విలువ, బంగారం మార్పిడిపై అతి తక్కువ తగ్గింపు, 100 శాతం బీఐఎస్ హాల్‌మార్క్ బంగారంతో ధృవీకరించిన వజ్రాభరణాలు తదితర సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో షోరూం డైరెక్టర్ జైనుద్దీన్, మేనేజర్‌లు ప్రేమ్‌కుమార్, రాములు, అమీన్ నిర్వహించారు.

