Monday, November 17, 2025
Homeలైఫ్ స్టైల్Neem Face Pack: మెరిసే చర్మం కోసం వేపాకు ఫేస్ ప్యాక్..ట్రై చేయండిలా..!

Neem Face Pack: మెరిసే చర్మం కోసం వేపాకు ఫేస్ ప్యాక్..ట్రై చేయండిలా..!

Beauty Tips: ఈరోజుల్లో ఆరోగ్యకరమైన చర్మం కోసం చాలామంది ఖరీదైన బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. కానీ, ఈ ప్రొడక్ట్స్ ఆశించిన ప్రయోజనాలు అందించవు. కొన్నిసార్లు వాటి దుష్ప్రభావాల కారణంగా మొటిమలు, దద్దుర్లు, చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వేధిస్తుంటాయి. అటువంటి పరిస్థితిలో వేపాకు ఫేస్ ప్యాక్ అద్భుత ఎంపిక అవుతుంది. ఎందుకంటే వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మాన్ని శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తాయి.

- Advertisement -

అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో తయారుచేసిన వేప ఫేస్ ప్యాక్ చవకైనది మాత్రమే కాదు. రసాయన రహితమైనది కూడా. చర్మం తరచుగా జిడ్డుగా లేదా మొటిమలు కనిపిస్తే, ఈ వేపాకు ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. సహజమైన మెరుపును అందిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలను అందించే వేపాకు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి? దాని అద్భుతమైన ప్రయోజనాలను ఏంటి? వంటి వివరాల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

also read:Iphone 15 Price Drop: రూ.47,999 కే ఐఫోన్ 15..ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదు.. ఇపుడే త్వరపడండి!

వేపాకు ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి?

ఆరోగ్యకరమైన చర్మం కోసం కొన్ని తాజా వేప ఆకులను తీసుకొని నీటితో మెత్తగా రుబ్బి, పేస్ట్ లాగా తయారు చేయాలి. తర్వాత దీనిలో అర టీస్పూన్ పసుపు పొడి, 1 టీస్పూన్ రోజ్ వాటర్ జోడించి బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు పాటు అలాగే ఉంచాలి. తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకోవాలి.

also read:Pomegranate Benefits: చర్మ సమస్యల నుంచి గుండె ఆరోగ్యం వరకు.. దానిమ్మ తినడం వల్ల కలిగే లాభాలివే!

వేపాకు ప్యాక్ వేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు

మొటిమలు: వేపలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ముఖం పై ఉన్న మొటిమలను తొలగిస్తాయి. అంతేకాదు బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. మంటను సైతం తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ వాడటం వల్ల చర్మాన్ని స్పష్టంగా మచ్చలు లేకుండా ఉంచుతుంది.

మెరిసే చర్మం: ఈ వేపాకు ఫేస్ ప్యాక్ చర్మాన్ని లోతుగా శుభ్రపరుస్తుంది. చనిపోయిన చర్మ కణాలను తొలగించి, సహజమైన మెరుపును అందిస్తుంది. దీనిలోని ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని తాజాగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి.

జిడ్డు చర్మం దూరం: ముఖంపై జిడ్డు తొలగించడంలో ఈ ప్యాక్ సహాయపడుతుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారికి వేప ప్యాక్ చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని నియంత్రించి, ముఖాన్ని జిగటగా ఉంచుతుంది.

మచ్చలు, టానింగ్‌: వేప క్రిమినాశక లక్షణాలు క్రమంగా మచ్చలు, టానింగ్‌ను తేలికపరుస్తాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వాడటం వల్ల చర్మ మెరుస్తుంది. ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

యాంటీ-ఏజింగ్: వేపలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E ఉంటాయి. ఇవి ముడతలను తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ప్యాక్ వృద్ధాప్య సంకేతాలను సైతం నివారిస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది.

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News