Thursday, March 12, 2026
Homeలైఫ్ స్టైల్Bread: వైట్ బ్రెడ్ మాత్రమే కాదు..మల్టీగ్రెయిన్ బ్రెడ్ తో కూడా అనారోగ్యం.. బ్రెడ్ కొనేటప్పుడు ఈ...

Bread: వైట్ బ్రెడ్ మాత్రమే కాదు..మల్టీగ్రెయిన్ బ్రెడ్ తో కూడా అనారోగ్యం.. బ్రెడ్ కొనేటప్పుడు ఈ విషయాలు గుర్తించుకోండి..

Bread Types And Disadvantages: చాలామంది తరచుగా అల్పాహారం లేదా సాయంత్రం స్నాక్స్ కోసం బ్రెడ్‌ను ఇష్టంగా తింటుంటారు. ఎందుకంటే? ఇది త్వరగా తినడానికి సిద్ధంగా ఉంటుంది. అంతేకాదు, ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. దీనిని బ్రెడ్ ఆమ్లెట్లు, శాండ్‌విచ్‌లు లేదా ఇతర వంటకాల్లో వివిధ మార్గాల్లో తినవచ్చు. వ్యక్తిగత రుచులు, అవసరాలకు అనుగుణంగా మార్కెట్లో వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ వంటి అనేక రకాల బ్రెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే, నిజంగా బ్రెడ్ తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందా అనే అనే విషయాన్ని ఎక్కువగా ఆలోచించము. చాలా మంది బరువు తగ్గడానికి లేదా ఆరోగ్యాంగా ఉండడానికి వైట్ బ్రెడ్ కు బదులుగా బ్రౌన్ లేదా హోల్-వీట్ బ్రెడ్‌ తినడానికి ఆసక్తి చూపుతారు. ఇది కేవలం ఆరోగ్యకరమైనదనే అపోహ కావచ్చు. గోధుమ రంగులో కనిపించే అన్ని బ్రెడ్ లు ఆరోగ్యకరమైనవి కాదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి మార్కెట్లో లభించే అనేక ఆరోగ్యకరమైన బ్రెడ్‌లలో చక్కెర స్థాయిలను పెంచే, జీర్ణక్రియకు అంతరాయం కలిగించే దాచిన పదార్థాలు ఉంటాయి. కాబట్టి, బ్రెడ్ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పరిశీలించడం ముఖ్యం. ఈ నేపథ్యంలో ఏ బ్రెడ్ తినడానికి కొనుగోలు చేయాలి? ఏ బ్రెడ్‌కు దూరంగా ఉండాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

- Advertisement -

మల్టీగ్రెయిన్ బ్రెడ్
మార్కెట్లో లభించే మల్టీగ్రెయిన్ బ్రెడ్ తరచుగా ఆరోగ్యకరమైనదిగా ప్రచారం చేయబడుతుంది. ముఖ్యంగా అనేక ప్రకటనల ద్వారా ఇందులో వివిధ ధాన్యాల కలయిక ఉందని చెప్పబడుతుంది. అయితే, నిపుణులు చెబుతున్న విషయం ఏంటంటే? మల్టీగ్రెయిన్ అనేది ఎల్లప్పుడూ తృణధాన్యం అని అర్థం కాదని, కొన్నిసార్లు ఈ బ్రెడ్‌లో ప్రధానంగా శుద్ధి చేసిన పిండి (మైదా) ఉంటుంది. కాకపోతే దానికి కొన్ని ధాన్యాలను మాత్రమే జోడిస్తారు. అదనంగా, గోధుమ రంగును అందించడానికి కారామెల్ లేదా మొలాసిస్ వంటి పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి నిజానికి చక్కెర రూపంలో ఉంటాయి. కాబట్టి, మల్టీగ్రెయిన్ బ్రెడ్ కొనుగోలు చేసేముందు, ప్యాకేజీ వెనుక ఉన్న పదార్థాలను సక్రమంగా తనిఖీ చేయడం చాలా అవసరం.

also read:Rotis: ఏ సీజన్ లో ఏ రొట్టె తినాలో తెలుసా..?

వైట్ బ్రెడ్
పోషకాహార పరంగా వైట్ బ్రెడ్ అత్యంత తక్కువ స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే? ఇది పూర్తిగా శుద్ధి చేసిన పిండితో తయారు చేయబడుతుంది. ఇందులో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు వంటి అవసరమైన పోషకాలు తక్కువగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత పెరగడానికి, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తుంది. పోషకాహార నిపుణుల ప్రకారం..వైట్ బ్రెడ్ కేవలం ఖాళీ కేలరీలను మాత్రమే అందించి, కడుపును నింపుతుంది. కానీ, శరీరానికి అవసరమైన పోషకాలను అందించదు.

సోర్‌డౌ బ్రెడ్
సోర్‌డౌ బ్రెడ్ జీర్ణక్రియ, గుండె ఆరోగ్యానికి సూపర్‌ఫుడ్ గా భావిస్తారు. బ్రెడ్ ప్రియులకైతే సోర్‌డౌ బ్రెడ్ ఉత్తమ ఎంపిక అవుతుంది. దీన్ని ప్రత్యేకంగా చేయడానికి కిణ్వ ప్రక్రియ ఉపయోగించబడుతుంది. ఈ ప్రక్రియలో సహజ ప్రోబయోటిక్స్ ఏర్పడతాయి. ఇవి ప్రేగుల ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. ఈ బ్రెడ్ ఇతర బ్రెడ్‌ల కంటే నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలలో అకస్మాత్తు పెరుగుదల తగ్గుతుంది. ఇప్పటికే ఉబ్బరం లేదా జీర్ణ సమస్యలున్న ఉంటె దీన్ని ఆహారంలో చేర్చడం ద్వారా జీర్ణ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు.

మొలకెత్తిన గ్రెయిన్ బ్రెడ్
మొలకెత్తిన గ్రెయిన్స్‌తో తయారు చేసిన బ్రెడ్‌ను కూడా చాలా ఆరోగ్యకరమైనదిగా పరిగణిస్తారు. మొలకెత్తే ప్రక్రియ వల్ల ధాన్యాల్లోని పోషక విలువలు పెరుగుతాయి. శరీరం వాటిని సులభంగా జీర్ణించి గ్రహించగలుగుతుంది. ఈ బ్రెడ్‌లో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా, కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారికి, జిమ్‌కు వెళ్లే వారికి ఇది మంచి ఎంపిక. అదనంగా, ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఫలితంగా ఎక్కువసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఇది పదే పదే తినే అలవాటును నివారిస్తుంది.

బ్రెడ్ కొనుగోలు చేసేటప్పుడు ఈ 3 విషయాలను గుర్తుంచుకోండి

  • బ్రెడ్ కొనుగోలు చేసేటప్పుడు లేబుల్ పరిశీలించాలి. ముఖ్యంగా “100% హోల్ గ్రెయిన్” అని స్పష్టంగా ఉందో లేదో తనిఖీ చేయాలి.
  •  ప్రతి స్లైస్‌కు చక్కెర కంటెంట్ 2 గ్రాముల కంటే తక్కువగా ఉందొ లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అధిక చక్కెర ఆరోగ్యానికి హానికరం.
  • బ్రెడ్‌లో ఫైబర్ కంటెంట్ కనీసం 3 నుంచి 5 గ్రాములు ఉండేలా చూసుకోవాలి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News