Emotions depend upon Blood Group: ప్రతి మనిషికీ సాధారణంగా కోపం వస్తుంటుంది. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. చుట్టూ ఉన్న పరిస్థితులు కారణం కావొచ్చు. కొన్ని సంస్కృతులు, మనలోని జన్యువులు, బ్లడ్ గ్రూప్.. మీ వ్యక్తిత్వాన్ని, భావోద్వేగాలను నిర్ణయిస్తుందని చెబుతారు. అయితే ఒక నిర్దిష్ట బ్లడ్ గ్రూప్ వారిలో.. కోపం, మొండితనం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయట. అయితే ఆ బ్లడ్ గ్రూప్ ఏంటి? వారిలో ఆ లక్షణాలు ఎందుకు కనిపిస్తాయి.. కారణాలు ఇక్కడ తెలుసుకుందాం..
సాంప్రదాయ నమ్మకాలు, కొన్ని పాత అధ్యయనాల ప్రకారం, ఇతర బ్లడ్ గ్రూప్‌ల వారితో పోలిస్తే.. ‘O’ బ్లడ్ గ్రూప్ వారిలో కోపం మొండితనం, దూకుడు లక్షణాలు కాస్త ఎక్కువగా ఉంటాయట. ‘O’ గ్రూప్ వ్యక్తులకు సాధారణంగా నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయంటారు. అదేవిధంగా ఆత్మవిశ్వాసం కూడా మెండుగానే ఉంటుందట. అయితే ఈ ఆత్మవిశ్వాసం ఎదుటివారి అభిప్రాయాలను అంగీకరించడంలో మొండితనంగా మారే అవకాశం ఉందని.. తాము అనుకున్నది జరగనప్పుడు లేదా తమ అధికారాన్ని ప్రశ్నించినప్పుడు వీరు త్వరగా ఆగ్రహానికి లోనవుతారని చెబుతారు.
ఇక ఇతర బ్లడ్ గ్రూప్‌ల వారి స్వభావాన్ని పరిశీలిస్తే..
A గ్రూప్ కలిగి ఉన్న వారు సాధారణంగా ప్రశాంతంగా, సున్నితంగా, బాధ్యతాయుతంగా ఉన్నా.. లోలోపల ఎక్కువ ఒత్తిడిని ఫీల్ అవుతారట. B గ్రూప్ మనుషులు సృజనాత్మకంగా, స్వేచ్ఛగా, చురుకుగా ఉంటారట. కానీ కొన్నిసార్లు తమ భావాలు స్థిరంగా లేకపోవడం వల్ల ఎమోషనల్‌గా కనిపించే అవకాశాలు ఉంటాయట.
Also Read: https://teluguprabha.net/devotional-news/significance-of-koti-somavaram-in-karthika-masam/
ఇక AB గ్రూప్ రక్తం వారిలో ప్రశాంతమైన, హేతుబద్ధమైన ఆలోచనలు ఉంటాయట. కానీ వీరిని అర్థం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుందని చెబుతారు. అయితే ఈ లక్షణాలు కేవలం కొన్ని సాంస్కృతిక నమ్మకాలే తప్ప, శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదనే వాస్తవాలు గమనించాలి. కోపం అనేది జీవనశైలి, అనుభవాలు పెంపకం వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: https://teluguprabha.net/telangana-news/cabinet-rank-for-sudarshan-reddy-and-premsagar-rao/
బ్లడ్ గ్రూపుల ద్వారా వ్యక్తిత్వాలను నిర్ణయించడం అనేది ఒక ఆసక్తికరమైన నమ్మకంగా గమనించాలి. మన కోపం లేదా స్వభావం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది. మన బ్లడ్ గ్రూపర్ కంటే, మనం నేర్చుకునే విషయాలు, మన చుట్టూ ఉన్న వాతావరణం, మనం భావోద్వేగాలను నియంత్రించుకునే విధానంపైనే మనం ఎంతగా కోపంగా ఉన్నాం.. ఆ కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాం అనేది నిర్ణయించవచ్చు.


