Saturday, November 15, 2025
Homeలైఫ్ స్టైల్OCD: ఓసీడీ అంటే ఏమిటి..దాని వల్ల ప్రమాదామా!

OCD: ఓసీడీ అంటే ఏమిటి..దాని వల్ల ప్రమాదామా!

OCD VS Health: ప్రతిరోజూ మనం అనేక పనులను చేస్తుంటాం. వాటిలో కొన్ని అలవాట్ల రూపంలో, కొన్ని ఆచరణలోకి వచ్చిన నిబంధనలుగా మారుతాయి. కానీ కొన్ని సందర్భాల్లో, ఈ నిబంధనలు మితిమీరిన స్థాయికి చేరి, మన ప్రవర్తనను ప్రభావితం చేయడం మొదలవుతుంది. అప్పుడు మనం ఓ ప్రత్యేక మానసిక స్థితిలో ఉన్నామా అనే ప్రశ్న తలెత్తుతుంది. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ లేదా ఓసీడీ కూడా అలాంటి మానసిక ఆరోగ్య సమస్యలలో ఒకటి.

- Advertisement -

యాంగ్జైటీ డిజార్డర్‌…

ఓసీడీ అనేది ఒక రకమైన యాంగ్జైటీ డిజార్డర్‌గా వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిలో ఉన్న వ్యక్తులకు ప్రతిదీ కచ్చితంగా ఉండాలి అనే భావన బలంగా ఉంటుంది. శుభ్రతపై గట్టి పట్టుదల, వస్తువులు సరిగ్గా సర్దివేయడం, అన్నీ స్థిరంగా ఉండాలని కోరుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు తలెత్తినప్పుడు ఆ వ్యక్తులు తీవ్రమైన ఒత్తిడికి గురవుతారు. ఇది ఒక్క వారికే కాకుండా, వారి కుటుంబ సభ్యులకూ సమస్యగా మారుతుంది.

శుభ్రతపై దృష్టి…

ఓసీడీ ఉన్న వారిలో తరచూ కనిపించే లక్షణాలలో శుభ్రతపై దృష్టి.. బయట నుండి వస్తువులను ఇంటికి తెచ్చినప్పుడు వాటిపై కీటకాలు ఉండవచ్చని అనుమానం కలుగుతుంది. దీని వల్ల అవన్నీ బాగా శుభ్రం చేయాలనే ఆలోచన వస్తుంది. ఏ చిన్న వ్యాధి వచ్చినా, దానిని అత్యంత జాగ్రత్తగా పరిగణించి ఎక్కువ ప్రాసెసింగ్ చేస్తారు. చేతులు పదే పదే కడుక్కోవడం, రోజులో ఎక్కువసార్లు స్నానం చేయడం, వస్తువుల్ని నిత్యం తుడవడం వంటి చర్యలు రెగ్యులర్‌గా కనిపిస్తాయి.

ఒత్తిడి..

ఇలాంటి వ్యక్తులు బయటకు వెళ్లేముందు ఎన్నోసార్లు గ్యాస్ ఆపారా లేదా, తాళం వేసామా లేదా, స్విచ్ ఆపారా లేదా అనే విషయాలపై సందేహంతో మళ్లీ మళ్లీ చెక్ చేస్తుంటారు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో అక్కడే ఉండాలనే నిబంధనలు పెట్టి, కుటుంబ సభ్యులపై ఒత్తిడి తేవడం ద్వారా సంబంధాలు కూడా దెబ్బతింటాయి. అటువంటి పరిస్థితులలో, సంబంధాలు బలహీనమవ్వడమే కాకుండా, బాధితుడు మరింత ఒత్తిడికి లోనవుతాడు.

ఓసీడీ వల్ల పరిగణించదగిన ఆందోళన స్థితులు ఏర్పడతాయి. అయితే ఈ సమస్యకు పరిష్కారం లేదు అనే అపోహ ఉండకూడదు. అనేక చికిత్సా విధానాలు లభించాయి. ముఖ్యంగా కాంగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే చికిత్స విధానం చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో, మన ఆలోచన విధానాన్ని సరిచేసే విధంగా నిపుణులు పాఠాలు అందిస్తారు. అలాగే యాంగ్జైటీ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్ కూడా శిక్షణ ద్వారా నేర్పబడతాయి.

Also Read: https://teluguprabha.net/lifestyle/foods-that-help-reduce-belly-fat-naturally-at-home/

వైద్యులు సూచించే చికిత్సా విధానాలలో మొదటిది ఈ బిహేవియర్ థెరపీ కాగా, మరింత తీవ్రమైన సందర్భాలలో మందులు కూడా సూచిస్తారు. అయితే, దీన్ని ప్రాథమిక దశలోనే గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. ప్రారంభంలో చికిత్స తీసుకుంటే త్వరగా రికవరీ సాధ్యమవుతుంది. దీని వల్ల వ్యక్తిగతంగా మరియు కుటుంబంగా కూడా ప్రశాంతత చేకూరుతుంది.

మానసిక సమస్యలకు..

ఓసీడీని పట్టించుకోకపోతే అది మరింత పెరిగి ఇతర మానసిక సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది. అందుకే ప్రవర్తనలో ఏవైనా అసాధారణ మార్పులు కనిపించిన వెంటనే మానసిక నిపుణుడిని సంప్రదించాలి. చికిత్సకు వెనకడుగు వేయకుండా, దాన్ని ఆరోగ్య సమస్యగా స్వీకరించి ముందుకు సాగితే జీవితం మెరుగ్గా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad