Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Poha Or Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?

Poha Or Upma: పోహా vs ఉప్మా..బరువు తగ్గడానికి ఏది బెటర్​?

Poha vs upma for weight loss: ఇండియాలో అల్పాహారం, భోజనం, రాత్రి భోజనాలకు వివిధ రకాల వంటకాలు చేస్తుంటారు. మన రోజు ఆరోగ్యకరమైన అల్పాహారంతో ప్రారంభమవుతుంది. అల్పాహారంలో భాగంగా అందరి ఇళ్లలో పోహా లేదా ఉప్మా తయారు చేసుకుంటారు. వీటిని తినడానికి తయారు చేయడం ఎంత సులభం అయినా, దాని ప్రయోజనాలు దాని కంటే చాలా ఎక్కువ. వీటిని ఉదయం తింటే ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలిగిస్తాయి. దీని కారణంగానే అతిగా తినడం మానేయవచ్చు. అయితే, బరువు తగ్గడం విషయానికి వస్తే, ఈ రెండు ఎంపికలలో ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందనే ప్రశ్న ఖచ్చితంగా అందరికి ఉంటుంది.

- Advertisement -

బరువు తగ్గాలనుకుంటే తీసుకునే ఆహారంలో చాలా తక్కువ కేలరీలు కలిగిన ఆహారాలను చేర్చుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, పోషకాలు ఉంటాయి. ఇటువంటి పరిస్థితిలో అల్పాహారంగా పోహా లేదా ఉప్మా తీసుకుంటే అందులో ఎన్ని కేలరీలు ఉంటాయి? ఏది ఎప్పుడు తినాలి? వీటిలో ఉండే పదార్థాలు శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read: Pregnancy: గర్భధారణ సమయంలో ఉదయాన్నే వీటిని తింటే.. తల్లికి, కడుపులో ఉన్న శిశువుకి ఎంతో మంచిది..

బరువు తగ్గడానికి పోహా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

పోహా ఎంతో ఆరోగ్యకరమైన అల్పాహారం. దీన్ని ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీంతో పోహాను తింటే కడుపు ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనివల్ల తక్కువ ఆకలిగా అనిపిస్తుంది. ఎక్కువ తినకుండా ఉంటాం. బరువు కూడా సులభంగా తగ్గొచ్చు. ఉదయానే దీని తింటే రోజంతా శక్తివంతంగా ఉంచుతుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా, జీవక్రియను కూడా వేగవంతం చేస్తుంది. దీని కారణంగానే పోహా కొవ్వును వేగంగా కరిగిస్తుంది. దీన్ని డైట్ లో చేర్చుకుంటే రోగనిరోధక శక్తి కూడా కూడా బలపడుతుంది.

బరువు తగ్గడానికి ఉప్మా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

బరువు తగ్గాలనుకుంటే ఉప్మా ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో మంచి మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. దీని కారణంగానే ఉప్మా తింటే కడుపు ఎక్కువసేపు నిండి భావన కలుగుతుంది. తక్కువ ఆకలిగా కూడా అనిపిస్తుంది. దీంతో బరువు కూడా తగ్గొచ్చు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉప్మా ను తయారు చేయడానికి అనేక కూరగాయలను ఉపయోగిస్తాం కాబట్టి శరీరంలోని ముఖ్యమైన పోషకాల లోపాన్ని తీరుస్తాయి.

Also Read: Blodd Pressure: అధిక రక్తపోటును నియంత్రించే సహజ చిట్కాలు..

బరువు తగ్గడానికి ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?

బరువు తగ్గాలనుకుంటే పోహా ఒక గొప్ప ఎంపిక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఉప్మాతో పోలిస్తే పోహాలో కేలరీల పరిమాణం చాలా తక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగకుండా నిరోధిస్తాయి. అలాగే, దీన్ని తినడం వల్ల శరీరంలో ప్రోటీన్ లోపం కూడా తీరుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad