Homeలైఫ్ స్టైల్Tea-Coffee Trend: ప్రొటీన్ టీ-కాఫీ ట్రెండ్

Tea-Coffee Trend: ప్రొటీన్ టీ-కాఫీ ట్రెండ్

ఇప్పుడు మనోళ్లు రేయింబవళ్లు తింటున్నది ప్రొటీన్, ప్రొటీన్, ప్రొటీన్. అదేమంటే ప్రొటీన్ తింటే ఆరోగ్యం, ఆయుష్షు, యవ్వనం..ఇలా తెగ లెక్చర్లు దంచేస్తున్నారు. ప్రొటీన్ కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో టీ-కాఫీలు కూడా ప్రొటీన్ వెరైటీల్లో వచ్చేసాయి. ప్రొటీన్ బ్రెడ్, ప్రొటీన్ కుకీస్, ప్రొటీన్ చిప్స్, ప్రొటీన్ వాటర్, ప్రొటీన్ ఐస్ క్రీం అంటూ మార్కెట్లో విచ్చలవిడిగా ట్రెండింగ్ ఫుడ్స్ వచ్చేసాయి. ఇక ప్రొటీన్ బార్స్ వంటివాటికైతే లెక్కేలేదు. ప్రొటీన్ క్రేజ్ తో అన్ని వయసులవారు ఈ ప్రాడక్ట్స్ ని తెగ తినేస్తున్నారు.

- Advertisement -

హెల్తీ డ్రింక్ సిరీస్ లో..

స్టార్ బక్స్ వంటి సంస్థలతో సహా ఫిట్నెస్ ప్రియులను ఆకట్టుకునేందుకు ప్రొటీన్ కాఫీలు మార్కెట్లో ట్రెండింగ్ గా మారాయి. హెల్తీ డ్రింక్ సిరీస్ లో భాగంగా టీ, కాఫీలు ప్రొటీన్ వర్షన్ లో అందుబాటులోకి వచ్చాయి.

ప్రొటీన్ కాఫీ, ప్రొటీన్ టీలలో రెడీమేడ్ ప్రొటీన్ షేక్ కలిపి తయారు చేస్తారు. కాఫీలోని కెఫిన్ తక్షణ శక్తిని ఇస్తే, ప్రొటీన్ కండరాలకు పోషణ అందిస్తుంది. దీంతో ఆకలి కూడా అదుపులో ఉంటుంది కానీ వేడి కాఫీలో ప్రొటీన్ పౌడర్ కలిపితే దాదాపుగా ప్రొటీన్ నాణ్యత దెబ్బతింటుంది. కాబట్టి గోరువెచ్చని లేదా కూల్ కాఫీలో కలిపితే మంచిది. కానీ సున్నితమైన జీర్ణక్రియ ఉన్నవారికి ఇలాంటి ప్రొటీన్ వెరైటీలతో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇన్స్టంట్ మసాలా ప్రొటీన్ చాయ్ ప్రీమిక్స్ లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

జస్ట్ వేడి నీళ్లలో కలిపేస్తే ప్రొటీన్ టీ రెడీ అవుతుంది కానీ ఇలాంటి పానీయాలు అందరి ఆరోగ్యాలకు సెట్ కావు. మనం ఇంట్లో తాగే రెగ్యులర్ కాఫీ-టీలల్లో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ లేదా వే ప్రొటీన్ కలుపుకుని హై ప్రొటీన్ టీ తయారు చేయచ్చు. నిజానికి సమతుల ఆహారం తింటే ఇలా ప్రొటీన్ ప్రయోగాలు చేయాల్సిన అవసరం తలెత్తదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News