Sravana Purnima: పండుగలు మన మనసులో కొత్త ఆశలు నింపుతాయి. ప్రతి పండుగకూ తన ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈసారి రాఖీ పౌర్ణమి రోజు సాంకేతికంగా, ఖగోళంగా కూడా ఓ చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. రక్షా బంధన్ అనే పండుగ అన్నాచెల్లెళ్ల ప్రేమకు చిహ్నం. కానీ ఈసారి రాఖీ పండుగ రోజు మనం ఆకాశంలో కనబడే గ్రహ కూర్పు దాదాపు 300 ఏళ్ల తర్వాత కనిపించబోతుంది.
2025 ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి జరుగుతుంది. ఆ తేదీన సూర్యుడు, చంద్రుడు కలిసి సహా ఇతర గ్రహాలు ఒక నిర్దిష్ట స్థితిలో ఉంటాయి. ఇది చివరిసారి 1728లో ఏర్పడిన ఖగోళ ఘటన. అంటే ఇప్పుడున్న తరంలోనిది రాకుండా ఎటువంటి అవకాశం లేదు. ఇది ఈ తరంలో ఒకే ఒక్క అవకాశం. దీన్ని ఖగోళ శాస్త్రవేత్తలు చాలా అరుదైన గ్రహస్థితిగా చెబుతున్నారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/varalakshmi-vratham-2025-puja-vidhanam-and-rules-explained/
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఆ రోజు సూర్యుడు కర్కాటక రాశిలో ఉంటాడు. చంద్రుడు మకర రాశిలో, కుజుడు కన్యా రాశిలో, బుధుడు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు. బృహస్పతి, శుక్రుడు ఇద్దరూ మిథున రాశిలో సంచరిస్తారు. రాహువు కుంభ రాశిలో ఉండగా, కేతువు సింహ రాశిలో ఉంటాడు. ఇలా గ్రహాలంతా తమ తమ ప్రత్యేక స్థానాల్లో ఉండటంతో ఈ రోజు ఖగోళంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అటువంటి గ్రహ యోగాలు కొన్ని రాశులవారికి అదృష్టాన్ని తెచ్చిపెడతాయని నమ్మకం. ఈసారి రాఖీ పౌర్ణమికి మకర, కుంభ, తుల రాశుల వారికి ఇదొక బంగారు అవకాశం అని చెబుతున్నారు. వీరి జీవితాల్లో ఆర్థికంగా, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా మంచి మార్పులు చోటుచేసుకుంటాయని అంచనా.
Also Read: https://teluguprabha.net/devotional-news/zodiac-signs-most-likely-to-doubt-their-partners-in-love/
ముందుగా మకర రాశి విషయానికి వస్తే, ఈ గ్రహయోగం వారిని అనేక మార్గాల్లో కలిసి రానుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు ఈ సమయానికి లాభాలను తీసుకొస్తాయి. ఊహించని డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు, వేతనాల్లో పెరుగుదల వంటి విషయాలు నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయి. నూతనంగా పెళ్లయిన దంపతులకు సంతాన భాగ్యం కలుగుతుందని కూడా భావిస్తున్నారు. వ్యాపార వర్గాల్లో ఉన్నవారికి మంచి ఒప్పందాలు లభించి, లాభాల తాకిడి ఎక్కువగా ఉండే సూచనలున్నాయి. న్యాయపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. మొత్తంగా చెప్పాలంటే, ఈ గ్రహ కూర్పు మకర రాశివారికి దారులు తెరిచే సమయం.
ఇక కుంభ రాశివారి విషయానికి వస్తే, రాఖీ పౌర్ణమి రోజు ఏర్పడే గ్రహస్థితి వారి జీవితాన్ని కొత్త దిశగా తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశాలు మెండుగా ఉంటాయి. గతంలో కష్టపడి ప్రయత్నించిన పనులకు ఇప్పుడు ఫలితం లభించే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయాలనే కోరిక నెరవేరవచ్చు. ఇంటి కల కూడా నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారికి తమ కోరిక మేరకు స్థిరమైన ఉద్యోగం దొరికే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయాణాలకి కూడా ఇది అనుకూల కాలమని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఆఫీసుల నుంచి ప్రశంసలు పొందే పరిస్థితులు ఏర్పడతాయి. ఎకానమీక్‌గా కూడా మంచి వృద్ధి కనిపిస్తుంది.
తుల రాశివారు కూడా ఈ అరుదైన ఖగోళ సంఘటన ఫలితాన్ని అనుభవించే అవకాశం కలిగి ఉన్నారు. చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. గతంలో ఇవ్వకుండా మిగిలిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఖరీదైన వస్తువుల కొనుగోలు చేయడానికి మంచి సమయం. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త ఒప్పందాలు చేసుకుని లాభాల్లో ఉండే అవకాశాలు ఎక్కువ. విద్యార్థులకు ఇది చదువు మీద దృష్టి పెట్టే ఉత్తమ సమయం. చదువులో కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఇది ఆరంభంగా మారుతుంది.
ఈ రాఖీ పౌర్ణమి ప్రత్యేకత కేవలం అనుబంధాలకే కాకుండా ఖగోళ చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలవనుంది. 297 ఏళ్ల తర్వాత మళ్లీ ఏర్పడుతున్న ఈ గ్రహయోగం కొన్ని రాశులవారికి జీవితాన్ని మార్చే అవకాశాలను తెస్తోంది.


