Rashmika Mandanna: హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత మరింత చర్చనీయాంశం అవుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ-రష్మిక వివాహం ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి రష్మిక ట్రెడిషనల్ లుక్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. సాంప్రదాయాల శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో చూపిస్తూ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తోంది. ముఖ్యంగా తన పెళ్లి వేడుకలో భారీగా బంగారు ఆభరణాల ధరించింది.
ఇక రిసెప్షన్‌లో తన కూర్గీ శైలి చీర ధరించి తమ సంస్క్రతిని మరింత గౌరవం తెచ్చింది. ఇలా ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్ ప్రియులను గ్లామరస్ లుక్‌తో కట్టిపడేస్తోన్న రష్మిక తాజాగా ఓ అవార్డు ఫంక్షన్‌లో ధరించిన చీర ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆమె స్టైలిస్ట్ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది. అంతేగాదు ఈ చీర ధర సమారు రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్‌తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్‌మెంట్ చెవిపోగులు, చిన్న నెక్‌చైన్, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె. అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్ ఫోటోలను రీపోస్ట్ చేస్తూ సదరు బ్రాండ్ ఇలా రాసింది. ‘మృణాలినీ రావు డిజైన్ చేసిన ఈ స్పెషల్ దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఆనందమే.. ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు’ అని రాసుకొచ్చింది.

