Dry Fruits: ఉరుకులు పరుగుల జీవితంలో మన ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. మన ఆరోగ్యం పూర్తిగా మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. అయితే నేటి బిజీ లైఫ్ లో ఉదయంపూట టిఫిన్ తినడమే మానేసాం. దీనికి బదులుగా టీతో, కొన్నిసార్లు బ్రెడ్‌తో మేనేజ్ చేస్తున్నాం. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక విషయం బాగా ట్రెండ్ అవుతోంది. అదేంటంటే..? ఉదయం ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినడం. కొందరు ఇది కడుపుని క్లీన్ గా ఉంచుతుందని, మరికొందరు మైండ్ ను షార్ప్ చేస్తుందని అంటున్నారు. కానీ, ఈ అలవాటు నిజంగా అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందా..? ఉదయం ఏ డ్రై ఫ్రూట్స్ తినాలి? ఎలా తినాలి? ఎంత తినాలి? అనే ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం.
ఉదయం ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినాలా వద్దా?
డ్రై ఫ్రూట్స్‌లో అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో వాటిని తినడం వల్ల శరీరానికి సూపర్ శక్తి పెరుగుతుంది. కానీ అవి అందరిపై ఒకే ప్రభావాన్ని చూపవు.
తెలుసుకోవలసిన ప్రయోజనాలు
శక్తిని పెంచేవి: ఉదయం నానబెట్టిన బాదం లేదా ఎండుద్రాక్ష తినడం వల్ల మెదడు చురుకుగా ఉంటుంది. దీంతో రోజంతా అలసట భావన కలగదు.
జీర్ణక్రియకు సహాయపడుతుంది: అంజీర్, ఎండుద్రాక్షలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఇవి మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. కడుపును క్లీన్ గా ఉంచుతుంది.
చర్మం, జుట్టుకు వరం: బాదం, వాల్‌నట్, జీడిపప్పులలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మాన్ని మెరుగుపరుస్తాయి.అంతేకాకుండా జుట్టును బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతాయి.
గుండెకు ప్రయోజనకరమైనవి: వాల్‌నట్స్‌లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
డ్రై ఫ్రూట్స్ ఎప్పుడు, ఎలా తినాలి..?
నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి. ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మంచిది. ఇవి క్రమంగా మన శక్తి, జీర్ణక్రియ, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కానీ, అవి తక్కువ పరిమిత పరిమాణంలో ఉండేటట్లు చూసుకోవాలి. బాదం, ఎండుద్రాక్ష, అంజూర పండ్లను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం తీసుకోవడం మంచిది. రోజు 4-5 బాదం, 2 వాల్‌నట్, 5 ఎండుద్రాక్ష, 1 అంజీర్ తీసుకుంటే సరిపోతుంది. అయితే, టీ లేదా కాఫీతో వీటిని అసలు తినకూడదు. ఎందుకంటే టీ డ్రై ఫ్రూట్స్ పోషకాలను పూర్తిగా శరీరంలోకి ప్రవేశించడానికి అడ్డుకుంటుంది.
వీరు జాగ్రత్తగా ఉండాలి?
మధుమేహం, జీర్ణ సమస్యలు లేదా గింజ అలెర్జీలు ఉన్నవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తినడం మంచిది.
Dry Fruits: ఉదయాన్నే ఖాళీ కడుపుతో డ్రై ఫ్రూట్స్ తినాలా.. వద్దా?
సంబంధిత వార్తలు | RELATED ARTICLES