Sunday, February 8, 2026
Homeలైఫ్ స్టైల్Over Eating: రుచిగా ఉందని అతిగా తింటున్నారా..? వచ్చే సమస్యలివే!

Over Eating: రుచిగా ఉందని అతిగా తింటున్నారా..? వచ్చే సమస్యలివే!

OverEating Side Effects: ఆహార రుచి బాగుందని ఆకలి లేకపోయినా ఎక్కువ తినేస్తుంటాం. ఇక పండగలు, పార్టీల సమయంలో అధిక మోతాదులో రుచికరమైన ఆహారాలను తినకుండా ఉండలేం. అయితే, తరచుగా అవసరం కంటే ఎక్కువ తినడం శరీరాన్ని నెమ్మదిగా రోగాల పాలు చేస్తుందని మీకు తెలుసా..? ఈ అలవాటు కేవలం బరువు పెరగడానికి మాత్రమే కాదు, అనేక తీవ్రమైన సమస్యలకు వ్యాధులకు కూడా దారితీస్తుంది. ఇప్పుడు అతిగా తినడం వల్ల వచ్చే 5 ప్రమాదకరమైన వ్యాధుల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.

- Advertisement -

ఊబకాయం ప్రమాదం

రుచికరమైన ఆహారం అతిగా తినడం వల్ల వచ్చే మొదటి ప్రమాదం ఊబకాయం. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తిన్నప్పుడు శరీరం వాటిని కొవ్వు రూపంలో నిల్వ చేస్తుంది. అది ఊబకాయానికి దారితీస్తుంది. కాబట్టి, శరీరంలో అధిక కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి కార్బోహైడ్రేట్లు, కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని తినడానికి ముందు లీన్ ప్రోటీన్, తక్కువ-స్టార్చ్ కూరగాయలను తినాలి. ఇది ఊబకాయాన్ని తగ్గిస్తుంది.

also read:Raw Garlic: వెల్లుల్లిని ఖాళీ కడుపుతో 7 రోజులు తింటే ఏమవుతుంది..? ఈ విషయాలు తెలుసుకోండి..!

గుండె ఆరోగ్యంపై ప్రభావం

అతిగా తింటే అది గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అతిగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ (HDL) తగ్గుతుంది. దీని వలన ధమనులలో అడ్డంకులు ఏర్పడవచ్చు. దీంతో గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి, గుండె ఆరోగ్యాంగా ఉండాలంటే ప్రతిరోజు 30-40 నిమిషాల పాటు వాకింగ్ చేయాలి.

కడుపు సమస్యలు

అతిగా తినడం వల్ల కూడా కడుపుపై ​​ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది అజీర్ణం, గ్యాస్, ఆమ్లత్వం, ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది. తరచుగా కారంగా ఉండే ఆహారాలు, వేయించిన ఆహారాలు, అనారోగ్యకరమైన కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. అంతేకాదు, ఈ అలవాటు మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఇది జ్ఞాపకశక్తిని కూడా బలహీనపరుస్తుంది. అందువల్ల కడుపు ఆరోగ్యం కోసం సులభంగా జీర్ణమయ్యే ఆహారాలు, పండ్లు, తాజా కూరగాయలు డైట్ లో ఉండేలా చేసుకోవాలి.

నిద్రపై ప్రభావం

అతిగా తినడం వల్ల శరీరం బరువుగా అనిపిస్తుంది. శరీరం త్వరగా అలసిపోయి విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గుల అవుతాయి. దీని వలన మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్ వంటి సమస్యలు కూడా రావచ్చు. అంతేకాదు, ఇది నిద్రలేమి, బద్ధకం, వేగవంతమైన హృదయ స్పందన, తలనొప్పికి కూడా కారణమవుతుంది.

వాంతులు, వికారం

అతిగా తినడం వల్ల కడుపు ఆహారంతో నిండిపోతుంది. ఇది వాంతులు, వికారం, అజీర్ణం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ఇది అసౌకర్యంగా అనిపించవచ్చు. ఇది రోజంతా ఉత్పాదకతను తగ్గిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News