Saturday, July 12, 2025
Homeలైఫ్ స్టైల్Protein: ఆరోగ్యానికి మంచిదని ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా..?

Protein: ఆరోగ్యానికి మంచిదని ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా..?

Protein Foods: ప్రోటీన్ మన శరీరానికి ఎంత అవసరమో చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మన కండరాల మరమ్మతుకు, రోగ నిరోధక శక్తి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. అయితే, చాలామంది ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిదని భావిస్తారు. ఈ కారణంగానే ఆహారంలో వీలైనన్ని ఎక్కువ ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ చేర్చుకుంటారు. ఇక జిమ్ కు వెళ్లేవారు అయితే ప్రోటీన్ పౌడర్ కూడా వాడుతారు. అయితే, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కూడా ఆరోగ్యానికి హానికరం కావచ్చు. ఒకవేళ మీలో ఈ క్రింది లక్షణాలు కనిపిస్తే మీరు అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నట్లు అర్థం.

ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా కార్బో హైడ్రేట్లు, ఫైబర్ తక్కువగా ఉన్నప్పుడు జీర్ణ వ్యవస్థ పై ఒత్తిడిని కలిగిస్తాయి. ఎందుకంటే శరీరానికి తగినంత ఫైబర్ లభించదు. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే మలబద్దకం కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా పెద్ద పరిమాణంలో పాలు లేదా ప్రోటీన్ సప్లిమెంట్లను తీసుకుంటే విరేచనాలు కూడా రావచ్చు.

చాలామంది ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే బరువు తగ్గుతాం అని అనుకుంటారు. కానీ, అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే అది బరువు పెరగడానికి కూడా దారితీస్తుంది. శరీరంలో అదనపు ప్రోటీన్ కేలరీలుగా నిల్వ ఉంటాయి. అవి కొవ్వుగా మారుతాయి. ముఖ్యంగా ఎక్కువ ప్రోటీన్ షేకులు లేదా సప్లిమెంట్లను తీసుకుంటే కేలరీలు తీసుకోవడం కూడా తెలియకుండానే పెరుగుతుంది.

అధిక ప్రోటీన్ వినియోగం మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగిస్తుంది. మూత్రపిండాలు ప్రోటీన్ జీర్ణం చేయడానికి, వ్యర్థ ఉత్పత్తులను తొలగించడానికి పనిచేస్తాయి. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాలు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఇది దీర్ఘకాలంలో మూత్రపిండాల సమస్యలకు కూడా దారితీస్తుంది. ఒకవేళ ఇప్పటికే మీకు ఏదైనా మూత్రపిండాల సమస్య ఉంటే ప్రోటీన్ మొత్తాన్ని పరిమితం చేయడం చాలా ముఖ్యం.

అధిక ప్రోటీన్ ఆహారాలు తీసుకోవడం వల్ల శరీరంలో జీవక్రియ ప్రక్రియ మారుతుంది. ఈ స్థితిలో శరీరం కిటోసిస్ మోడ్ లోకి వెళుతుంది. దీనిలో కీటోన్ బాడీలు ఏర్పడతాయి. ఈ కీటోన్లు శ్వాస నుండి బలమైన వాసనను కలిగిస్తాయి. దీనిని తరచుగా “కీటో శ్వాస” అని కూడా పిలుస్తారు. ఒకవేళ మీ శ్వాస వింతగా వాసన వస్తే అది మీరు తీసుకునే ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా కావచ్చు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News