Friday, March 13, 2026
Homeలైఫ్ స్టైల్Telugu health tips: చిన్నారులకు వెండి పట్టీలు.. సంప్రదాయం వెనుక ఉన్న అసలైన లాజిక్ ఇదే

Telugu health tips: చిన్నారులకు వెండి పట్టీలు.. సంప్రదాయం వెనుక ఉన్న అసలైన లాజిక్ ఇదే

Baby silver anklet: చిన్న పిల్లలకు వెండి మొలతాడు కట్టడం వెనుక మన పెద్దలు చెప్పిన కారణాలు కేవలం నమ్మకాలు కాదు… అందులో ఆరోగ్యపరమైన లాజిక్ కూడా ఉంది. పుట్టిన వెంటనే లేదా కొద్దిరోజుల తర్వాత పిల్లల కాళ్లకు వెండి మొలతాడు వేయడం మన సంప్రదాయంలో చాలా సాధారణం. దీని వెనుక ప్రధానంగా రెండు విషయాలు ఉన్నాయి… ఒకటి పిల్లలను నెగటివ్ ఎనర్జీ నుంచి కాపాడటం… రెండోది వారి శరీర అభివృద్ధికి సహాయం చేయడం.

- Advertisement -

వెండి మొలతాడు ఉండటం వల్ల ఉపయోగం

పుట్టిన చిన్న పిల్లల శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. వారి నాడీవ్యవస్థ పూర్తిగా డెవలప్ కాలేదు. కాళ్ల దగ్గర ముఖ్యమైన నాడులు ఉంటాయి. ఆయుర్వేద ప్రకారం పాదాల్లో ఉన్న నాడులు నేరుగా మెదడుతో కనెక్ట్ అయి ఉంటాయి. వెండి సహజంగా చల్లదన గుణం కలిగిన లోహం. చిన్న పిల్లల్లో శరీర వేడి ఎక్కువగా పెరిగితే జ్వరం, చిరాకు, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు చీలమండల దగ్గర వెండి మొలతాడు ఉండటం వల్ల ఆ హీట్ క్రమంగా తగ్గుతుంది. దీనివల్ల పిల్లలు కాస్త కూల్‌గా ఉంటారు, ఏడుపు తగ్గుతుంది, నిద్ర బాగా పడుతుంది.

వెండి పిల్లలకు సపోర్ట్‌లా పనిచేస్తుంది

వెండి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటుంది. చిన్న పిల్లలు నేలపై పాకుతూ తిరుగుతారు, ఏదో ఒకటి చేతిలో పెట్టుకుని నోట్లో పెట్టుకుంటారు. అలాంటి సమయంలో చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు రావడం చాలా కామన్. వెండి మొలతాడు కాళ్ల దగ్గర ఉండటం వల్ల అక్కడి సూక్ష్మక్రిములు పెరగకుండా కొంతవరకు అడ్డుకుంటుంది. ఇది పూర్తిగా రక్షణ ఇవ్వకపోయినా, సహజమైన సపోర్ట్‌లా పనిచేస్తుంది.

చెడు దృష్టి నుంచి కాపాడుతుంది

మన పెద్దలు చెప్పే “చెడు దృష్టి” విషయం కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. చిన్న పిల్లలు అందంగా ఉంటే, బాగా నవ్వితే, వాళ్లపై ఎక్కువ మంది చూపు పడుతుంది. ఆయుర్వేదం ప్రకారం ప్రతి మనిషి నుంచి ఎనర్జీ వెలువడుతుంది. కొన్నిసార్లు ఆ ఎనర్జీ నెగటివ్‌గా ఉంటుంది. వెండి ఆ నెగటివ్ ఎనర్జీని అబ్సార్బ్ చేసే గుణం కలిగి ఉంటుంది. అందుకే పిల్లలకు వెండి మొలతాడు, వెండి గొలుసు, వెండి కడియాలు వేయించేవారు. ఇది పిల్లల చుట్టూ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుందని నమ్మకం.

పిల్లల ఎదుగుదలలో మార్పు…

చీలమండల (కాలి కింది భాగం) దగ్గర ఉన్న నాడులు ఎముకల అభివృద్ధితో సంబంధం కలిగి ఉంటాయి అని ఆయుర్వేద గ్రంథాల్లో ఉంది. వెండి మొలతాడు ఆ ప్రాంతంలో మృదువుగా తగిలేలా ఉండటం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. దాంతో కాళ్ల కండరాలు బలపడతాయి, నడక త్వరగా వస్తుంది అని అనుభవపూర్వకంగా చాలామంది తల్లిదండ్రులు చెబుతుంటారు. ముఖ్యంగా కొన్ని పిల్లలకు ఆలస్యంగా నడక రావడం, కాళ్లలో బలహీనత కనిపించడం లాంటి సమస్యలు ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వెండి మొలతాడు ఒక చిన్న సహాయక పద్ధతిగా ఉపయోగపడుతుంది.

Read Also: Budget headphones: రూ. 2వేలలోపు టాప్ 4 వైర్లెస్ హెడ్‌ఫోన్స్.. ఈ 4 మోడల్స్‌పై ఒక లుక్కేయండి

పిల్లలకు ఎదురయ్యే సమస్యలు

ఇంకా పిల్లల్లో వచ్చే కడుపు నొప్పులు, గ్యాస్ సమస్యలు కూడా తగ్గుతాయని కొందరు ఆయుర్వేద వైద్యులు చెబుతారు. పాదాల్లో ఉన్న కొన్ని ప్రెషర్ పాయింట్స్ జీర్ణవ్యవస్థతో కనెక్ట్ అయి ఉంటాయి. వెండి మొలతాడు ఆ పాయింట్స్‌పై స్వల్ప ఒత్తిడి కలిగిస్తుంది. దాంతో డైజెషన్ కాస్త మెరుగవుతుంది. పిల్లలు తక్కువగా వాంతులు చేయడం, కడుపు ఉబ్బరం తగ్గడం లాంటి మార్పులు కనిపించవచ్చు.

గుర్తు పెట్టుకోవల్సిన విషయం

ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వెండి మొలతాడు చాలా బిగుతుగా కట్టకూడదు. పిల్లల కాళ్లకు మార్క్ పడేంత టైట్‌గా ఉంటే రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అలాగే చాలా లూజ్‌గా ఉంటే పడిపోయే ప్రమాదం ఉంటుంది. నడిచేటప్పుడు కాస్త కదిలేలా, చీలమండ దగ్గర మృదువుగా తగిలేలా ఉండాలి. వీలైతే ప్యూర్ సిల్వర్‌తో చేసిన మొలతాడు వాడాలి. ఫ్యాషన్ కోసం మిక్స్ మెటల్ వాడితే ఆరోగ్య ప్రయోజనం అంతగా ఉండదు.

వారినికి ఒకసారి తప్పనిసరి

వారానికి ఒకసారి గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు వేసి వెండి మొలతాడును శుభ్రం చేస్తే మంచిది. ఇలా చేస్తే దానిపై చేరిన మలినాలు తొలగిపోతాయి, నెగటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుందని పెద్దల మాట. పిల్లలకు వేయించే ముందు కూడా ఒకసారి శుభ్రం చేయడం అలవాటు చేసుకుంటే ఇంకా బాగుంటుంది.

తప్పు చేసేది ఇదే

చాలామంది చేసే తప్పు ఏంటంటే… వెండి మొలతాడు వేసిన తర్వాత డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదనుకోవడం. అది పూర్తిగా తప్పు. పిల్లలకు జ్వరం వచ్చినా, ఇన్ఫెక్షన్ కనిపించినా, ఏదైనా అసాధారణ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. వెండి మొలతాడు ఒక సహజమైన సపోర్ట్ మాత్రమే… ట్రీట్మెంట్‌కు ప్రత్యామ్నాయం కాదు.అయితే దీనిని మ్యాజిక్‌లా చూడకుండా ఒక సంప్రదాయ ఆరోగ్య సహాయక పద్ధతిగా మాత్రమే భావించాలి. సరైన ఆహారం, శుభ్రత, టైమ్‌కు టీకాలు, అవసరమైన వైద్య సలహా ఇవన్నీ పాటించినప్పుడే పిల్లల ఆరోగ్యం నిజంగా బలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News