Simple Tips for Period Pain Relief: మహిళల్లో ఋతుచక్రం ఒక్కొక్కరికి ఒక్కోలా భిన్నంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో కొంతమందికి తక్కువ నొప్పి అనుభవిస్తే.. మరికొందరు ఉపశమనం కలిగించనంత తీవ్రమైన నొప్పిని అనుభవిస్తుంటారు. మహిళల శరీరంలో పీరియడ్స్ అనేది ఒక సహజ ప్రక్రియ. రుతు క్రమం తప్పకుండా ఉండటం ఆరోగ్యానికి చాలా కీలకం. అయితే, చాలా మంది మహిళలకు పీరియడ్స్ సమయంలో చికాగుతో ఇబ్బంది పడుతుంటారు. వారి మానసిక స్థితిలో మార్పులు రావడమే కాకుండా భరించలేని నొప్పి, తిమ్మిరితో బాధపడుతుంటారు. ముఖ్యంగా, పీరియడ్స్ మొదటి మూడు రోజులలో కొందరు తీవ్రమైన నొప్పి, తిమ్మిరిని అనుభవిస్తారు. దీని వలన రోజువారీ పనులు చేయడం కష్టతరమవుతుంది. చాలా మంది మహిళలు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి మందులు వేసుకుంటారు. కానీ, ఇలాంటి నొప్పి నివారణ మందులు శరీరంపై అనేక సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయని అస్సలు గుర్తించరు. బాధాకరమైన పీరియడ్స్ నుండి ఉపశమనం పొందడానికి ఐదు చక్కటి నివారణ మార్గాలున్నాయి. అవేంటో చూద్దాం.
1. సోంపు వాటర్
పీరియడ్స్ సమయంలో సోంపు నీటిని తాగడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గ్లాసు నీరు తీసుకొని దానిలో ఒక టీస్పూన్ సోంపు గింజలను వేయండి. అనంతరం, ఒక చిటికెడు క్యారమ్ గింజలను వేసుకొని, ఈ నీటిని బాగా మరిగించి వడకట్టండి. పీరియడ్స్‌లో వచ్చే నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి రోజంతా ఈ నీటిని త్రాగండి.
2. మెంతి గింజలు
మెంతి గింజలను పీరియడ్స్ నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు కూడా ఉపయోగించవచ్చు. మెంతి గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. తద్వారా ఋతు తిమ్మిరిని తగ్గించడంలో సహాయపడతాయి. ఉప్పు తేమను కలిగిస్తుంది.తద్వారా పొడిబారడం, నొప్పిని నివారిస్తుంది.
3. యోగా చేయడం
యోగాతో మీ పీరియడ్స్ నొప్పిని తగ్గించుకోవచ్చు. యోగా రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. కండరాల ఒత్తిడిని తగ్గిస్తుంది. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బద్ద కోనసన (సీతాకోకచిలుక భంగిమ), ధనురాసన (విల్లు భంగిమ), ఉష్ట్రాసన (ఒంటె భంగిమ) వంటి యోగాసనాలు నొప్పి తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆసనాలు ఋతు ప్రవాహం సజావుగా సాగడానికి దారితీస్తాయి. అయితే, మీ ఋతు కాలంలో ఎటువంటి కఠినమైన వ్యాయామాలు చేయరాదని ఆరోగ్య నిపుణులు చెబతున్నారు.
4. హాట్‌ప్యాక్ వాడొచ్చు
మీరు తరచుగా మీ పీరియడ్స్ సమయంలో నొప్పితో ఇబ్బంది పడుతున్నట్టయితే, హాట్‌ప్యాక్‌ను ఉపయోగించండి. ఇది మీ నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ఋతు తిమ్మిరిని తగస్తుంది.


