Friday, March 13, 2026
Homeలైఫ్ స్టైల్Office health tips: ఆఫీస్ ఉద్యోగులు జాగ్రత్త.. 30 ఏళ్లకే హార్ట్ ఎటాక్ రిస్క్ పెరగడానికి...

Office health tips: ఆఫీస్ ఉద్యోగులు జాగ్రత్త.. 30 ఏళ్లకే హార్ట్ ఎటాక్ రిస్క్ పెరగడానికి అసలు కారణం ఇదే

Telugu health: ఈ రోజుల్లో మన జీవితం మొత్తం కూర్చునే జీవనశైలిగా మారిపోయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఎక్కువ సమయం కుర్చీలోనే గడుస్తోంది. ఆఫీస్ పని, ఇంటి పనులు, మొబైల్ స్క్రీన్, టీవీ… అన్నీ కూర్చునే చేస్తూ ఉంటాం. బయటకు వెళ్లినా వాహనాల్లోనే ప్రయాణం. ఇలా రోజుకు 8 గంటలు కాదు, చాలామంది 9 గంటలు, 10 గంటలకు పైగా కూర్చుంటున్నారు. ఇది మనకు అలవాటుగా మారిపోయినా, శరీరానికి మాత్రం ఇది పెద్ద హెచ్చరిక. ముఖ్యంగా రోజుకు 20 నిమిషాలు కూడా లేచి నడవని అలవాటు ఉంటే, శరీరం లోపలే నెమ్మదిగా దెబ్బతినడం మొదలవుతుంది.

- Advertisement -

కూర్చుంటే రక్త ప్రసరణ మీద ప్రభావం

ఎక్కువసేపు కూర్చుంటే మొదట ప్రభావం పడేది రక్త ప్రసరణ మీద. కదలిక లేకపోతే కాళ్ల దగ్గర రక్తం నిల్వైపోతుంది. రక్త ప్రవాహం మందగిస్తుంది. దీని వల్ల బ్లడ్ క్లాట్స్ ఏర్పడే అవకాశం పెరుగుతుంది. రక్తం సరిగా ప్రవహించకపోతే గుండె మీద ఒత్తిడి పెరుగుతుంది. క్రమంగా గుండె సంబంధిత సమస్యలు మొదలవుతాయి. ఒకప్పుడు ఇవి వయసు మీద పడినవాళ్లలో మాత్రమే కనిపించేవి. ఇప్పుడు 3 0 సంవత్సరాల వయసులోనే హార్ట్ సమస్యలు కనిపిస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం కూర్చునే జీవనశైలి, కదలిక లేకపోవడమే.

కూర్చోవడం వల్ల మెటబాలిజం మీద ప్రభావం

కూర్చోవడం వల్ల మెటబాలిజం కూడా మందగిస్తుంది. శరీరం కాలరీలను బర్న్ చేయడం తగ్గిపోతుంది. మనం తినే ఆహారం ఎనర్జీగా మారకుండా కొవ్వుగా నిల్వ అవుతుంది. దాంతో బరువు పెరుగుతుంది. పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అక్కడి నుంచి డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు మొదలవుతాయి. రోజుకు కనీసం 3 0 నిమిషాలు కూడా కదలని వాళ్లలో ఇన్సులిన్ స్పందన తగ్గిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. ఇది దీర్ఘకాలంలో పెద్ద వ్యాధులకు దారి తీస్తుంది.

ఎక్కువ సేపు కూర్చుంటే జరిగేది ఇదే

లాంగ్ టైమ్ సిట్టింగ్ వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, భుజాల నొప్పి ఇప్పుడు సాధారణ సమస్యలుగా మారాయి. చాలామంది కుర్చీలో వంగి కూర్చుంటారు. దీని వల్ల వెన్నెముక సహజ ఆకారం చెడిపోతుంది. క్రమంగా సర్వైకల్, లంబార్ సమస్యలు వస్తాయి. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చోవడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. తలనొప్పి, కంటి మసక, శరీర అలసట కనిపిస్తుంది. చిన్న వయసులోనే డిస్క్ ఇష్యూలు రావడం కూడా ఇదే కారణం.

శరీరానికే కాదు మనసుపై కూడా ప్రభావం

శరీరంతో పాటు మనసు కూడా దీనివల్ల ప్రభావితమవుతుంది. రోజంతా ఒకే చోట కూర్చోవడం వల్ల మెదడుకు సరిపడ ఆక్సిజన్ అందదు. దాంతో ఫోకస్ తగ్గుతుంది. పని మీద ఆసక్తి తగ్గిపోతుంది. చిన్న చిన్న విషయాలకే చిరాకు వస్తుంది. స్ట్రెస్ స్థాయి పెరుగుతుంది. దీర్ఘకాలంలో ఆందోళన, నిరాశ లక్షణాలు కనిపించవచ్చు. కదలిక లేకపోవడం మన భావోద్వేగాలను కూడా నెమ్మదిగా మార్చేస్తుంది.

Read Also: Apple shares official data: యాపిల్ ఉద్యోగులకు స్మార్ట్ ట్రైనింగ్.. సేల్స్ కోచ్‌తో మారనున్న కస్టమర్ సర్వీస్

దీనికి పరిష్కారం ఏమిటి

ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే పరిష్కారం ఏమిటి. రోజూ గంటల తరబడి జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ప్రతి 30 నిమిషాలకు ఒకసారి లేచి 2 నుంచి 3 నిమిషాలు నడవడం చాలూ. ఫోన్‌లో మాట్లాడేటప్పుడు నిలబడి మాట్లాడండి. నీళ్లు తాగడానికి వెళ్లేటప్పుడు కొంచెం ఎక్కువ దూరం నడవండి. లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కండి. రోజుకు కనీసం 30 నిమిషాలు వేగంగా నడిస్తే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్త ప్రసరణ చక్కగా ఉంటుంది. శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

ఉద్యోగులు కూర్చునే విధానంపై శ్రద్ద

ఆఫీస్‌లో పనిచేసే వాళ్లు తమ కూర్చునే విధానంపై కూడా శ్రద్ధ పెట్టాలి. వెన్ను నిటారుగా ఉండాలి. స్క్రీన్ కళ్ల స్థాయిలో ఉండాలి. పాదాలు నేలపై సరిగా ఉండాలి. ఎక్కువసేపు ఒకే పొజిషన్‌లో ఉండకుండా మధ్య మధ్యలో స్ట్రెచింగ్ చేయాలి. ఈ చిన్న జాగ్రత్తలు వెన్నునొప్పిని తగ్గిస్తాయి, మెడ బిగుతును తగ్గిస్తాయి. ఇవన్నీ చేయడం కష్టం కాదు కానీ చేయకపోవడమే అసలు సమస్య.

ఇలా చేస్తే మంచిది

కూర్చోవడం పూర్తిగా మానేయడం సాధ్యం కాదు. కానీ నిరంతరం కూర్చోవడమే ప్రమాదం. శరీరం కదలడానికి రూపొందింది. కదలికే జీవం. రోజుకు 20 నిమిషాలు కూడా కదలకుండా ఉంటే అది చిన్న విషయం కాదు. ఈరోజే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి గంటకు లేచి నిలబడండి. 5 నిమిషాలు నడవండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడే ప్రారంభించండి. చిన్న అడుగు అయినా సరే… అదే మీ జీవితాన్ని మార్చే పెద్ద మొదటి అడుగు అవుతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News