Sunday, November 16, 2025
Homeలైఫ్ స్టైల్Orange peel: ఆరంజ్ తొక్కలతో ఇలా చేస్తే చందమామ లాంటి ముఖం మీ సొంతం..

Orange peel: ఆరంజ్ తొక్కలతో ఇలా చేస్తే చందమామ లాంటి ముఖం మీ సొంతం..

Orange Peel For Skin: చాలా మంది మనలో నారింజ పండు తిని, వాటి తొక్కలను పనికిరానివిగా భావించి పడేస్తుంటారు. అయితే, ఈ తొక్కలు అందానికి ఒక నిధిని కలిగి ఉన్నాయని తెలియదు. నారింజ తొక్కలలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, సహజ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు, ముఖం పై ఉన్న మచ్చలను తొలగిస్తాయి. అంతేకాదు, ఈ తొక్కలు ముఖానికి సహజ మెరుపును తీసుకురావడంలో ప్రభావవంతంగా ఉంటాయి. నారింజ తొక్కలతో తయారు చేసే ఫేస్ ప్యాక్‌లు, స్క్రబ్‌లు ముఖాన్ని లోతుగా శుభ్రపరుస్తాయి. ప్రత్యేక విషయం ఏంటంటే? ఇవి పూర్తిగా సహజమైనవి. వీటి వినియోగం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ క్రమంలో మెరిసే చర్మం కోసం నారింజ తొక్కలను ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

 

నారింజ తొక్కల పొడి ఫేస్ ప్యాక్: ఈ పేస్ ప్యాక్ తయారు కోసం ఎండలో ఆరబెట్టిన నారింజ తొక్కలను తీసుకుని పొడిగా రుబ్బుకోవాలి. తర్వాత పేస్ ప్యాక్ కు తగినంత పొడి తీసుకుని, అందులో 1 టీస్పూన్ శనగ పిండి, 2 టీస్పూన్ల పెరుగుతో కలిపి బాగా మిక్స్ చేయాలి. అనంతరం ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేసుకోవాలి. 15 నిమిషాలు తర్వాత పేస్ ను క్లీన్ చేసుకోవాలి. ఈ ప్యాక్ టానింగ్ ను తొలగించి, ముఖాన్ని మెరిసేలా చేస్తుంది.

నల్ల మచ్చల కోసం ఆరంజ్ స్క్రబ్: తాజా నారింజ తొక్కలను తేనె లేదా నిమ్మరసంతో బాగా మిక్స్ చేయాలి. తర్వాత ఈ స్క్రబ్‌ను ముఖంపై సున్నితంగా రుద్దాలి. ఈ స్క్రబ్ డెడ్ స్కిన్ ను తొలగించి, మచ్చలను తేలికపరుస్తుంది.

also read:Protein: ఆరోగ్యానికి మంచిదని ప్రొటీన్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారా..?ఈ విషయాలు తెలిస్తే..

జిడ్డు చర్మం కోసం టోనర్: ముఖం పై జిడ్డు సమస్యతో బాధపడుతుంటే ఆరంజ్ టోనర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందుకోసం నారింజ తొక్కలను నీటిలో మరిగించి, చల్లబడిన తర్వాత వడకట్టాలి. అనంతరం ఈ నీటిని రిఫ్రిజిరేటర్‌లో స్ప్రే బాటిల్‌లో నిల్వ చేయాలి. టోనర్‌గా ముఖంపై రోజుకు రెండుసార్లు స్ప్రే ఈ నీటిని చేయండి. ఇది చర్మాన్ని తాజాగా, జిడ్డు లేకుండా చేస్తుంది.

మొటిమల నియంత్రణ మాస్క్: నారింజ తొక్కల పొడిని ముల్తానీ మిట్టి, రోజ్ వాటర్‌తో బాగా మిక్స్ చేయాలి. అప్పుడు ఇది మృదువైన పేస్ట్‌ లాగా తయారు అవుతుంది. దీన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు మొటిమలను తగ్గించి, చర్మాన్ని క్లీన్ గ ఉంచుతుంది.

సహజ బ్లీచింగ్ ఏజెంట్: నారింజ తొక్కలు చర్మానికి సహజమైన మెరుపును అందిస్తాయి. ఇందుకోసం కొద్దిగా నారింజ తొక్కల పొడిని పాలతో కలిపి పేస్ట్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి 10 నిమిషాలు అప్లై చేసి, సున్నితంగా మసాజ్ చేయాలి. ఇది చర్మపు రంగును కాంతివంతం చేస్తుంది. అంతేకాదు సహజమైన మెరుపును తీసుకువస్తుంది.

 

నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad