Homeలైఫ్ స్టైల్Dates Coffee: డేట్స్ కాఫీ ట్రెండ్.. కాఫీకి కొత్త హెల్తీ ట్విస్ట్

Dates Coffee: డేట్స్ కాఫీ ట్రెండ్.. కాఫీకి కొత్త హెల్తీ ట్విస్ట్

Dates Coffee: ప్రతి రోజూ మనం తాగే కాఫీకి ఇప్పుడు ఆరోగ్యకరమైన కొత్త డ్రింక్ వచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తాజా ఫుడ్ ట్రెండ్ పేరు ‘సోకింగ్ డేట్స్ ఇన్ కాఫీ‘. అంటే ఖర్జూరాలను కాఫీలో నానబెట్టి తాగే ఈ కొత్త వెరైటీ డ్రింక్ ఇప్పుడు కాఫీ లవర్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా కాఫీలో చక్కెర లేదా స్వీటెనర్స్ వేసుకుంటాం. కానీ ఇప్పుడు వాటి బదులు ఖర్జూరాలను ఉపయోగించడం ట్రెండ్‌గా మారింది. ఖర్జూరాల్లో సహజంగా ఉండే తీపి కాఫీకి ఒక ప్రత్యేకమైన క్యారమెల్ ఫ్లేవర్‌ను ఇస్తుంది. దీంతో కాఫీ రుచి మరింత రిచ్‌గా, నేచురల్‌గా మారుతుంది.

- Advertisement -

ఇంట్లోనే ఈజీగా డేట్ కాఫీ తయారీ
వేడి కాఫీలో ఖర్జూరాలను వేసి రాత్రంతా లేదా కనీసం కొన్ని గంటలు పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని తేలికగా మెత్తగా చేసి కలిపితే కాఫీకి సహజమైన తీపి, క్యారమెల్ లాంటి రుచి వస్తుంది. చక్కెర అవసరం లేకుండా హెల్తీగా ఆస్వాదించవచ్చు. ఈ కొత్త కాంబినేషన్ కేవలం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరాల్లో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో శరీరానికి శక్తిని ఇస్తాయి. ఇక కాఫీలోని కెఫీన్‌తో కలిసి ఇవి తక్షణ ఎనర్జీ బూస్ట్‌ను అందిస్తాయి. ఐస్ కాఫీ, కోల్డ్ కాఫీ లేదా రెగ్యులర్ హాట్ కాఫీ – ఏ రూపంలోనైనా ఖర్జూరాలను జోడించవచ్చు. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు లేదా మధ్యాహ్నం స్నాక్ టైమ్‌లో ఈ డేట్ కాఫీని తాగడం చాలా మందికి అలవాటవుతోంది.

ప్రత్యేకత ఏంటంటే..
ప్రస్తుతం హెల్తీ ఆల్టర్నేటివ్స్ వైపు ప్రజలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. రిఫైన్డ్ షుగర్ తగ్గించి, నేచురల్ స్వీటెనర్స్‌ను ఎంచుకోవడం ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం. అలానే, కొత్త రుచులను అనుభవించాలనుకునే యువతలో ఈ “డేట్ కాఫీ”కి మంచి డిమాండ్ పెరిగింది. కాఫీని రోజూ తాగే వారైతే ఒకసారి ఈ డేట్స్ కాఫీని ట్రై చేసి చూడండి. రుచిలో కొత్తదనం, ఆరోగ్యం లాభంతో పాటు రెండూ కలిపి ఇస్తున్న ఈ డ్రింక్ ఈ సమ్మర్‌లో తప్పక ప్రయత్నించాల్సిందే.

Also Read: Watermelon Coffee: సమ్మర్ స్పెషల్.. వాటర్మెలన్ కాఫీ ట్రెండ్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News