Strong Muscles Tips: వయస్సు పెరిగే కొద్దీ కండరాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. శరీర బరువులో 60 శాతం కండరాలే. మన డైలీ లైఫ్ లో ఎలాంటి పనులు చేయాలన్న కండరాల బలం ఎంతో అవసరం. ఎక్కువ సమయం కూర్చోవడం, ఏదైనా వస్తువును పట్టుకోవడం, ఏదైనా తెరవడం, నడవడానికి కూడా బలమైన కండరాలు అవసరం. అయితే, 35 నుండి 40 సంవత్సరాల వయస్సులో కండరాలు బలహీనపడటం ప్రారంభిస్తాయి. కండరాలు బలహినపడటం శరీరం సహజ ప్రక్రియ. దీంతో కొన్ని సార్లు నడవడానికి కూడా సాధ్యపడదు. అందుకే 35 సంవత్సరాల తర్వాత కూడా కండరాలను బలోపేతం చేయడానికి కృషి చేయాలి. అయితే ఇప్పుడు ఈ వయసులో కండరాలను బలోపేతం చేయడానికి ఏ వ్యాయామాలు చేయాలో? ఆహారంలో ఏమి చేర్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కండరాలు బలహీనంగా ఉన్నాయని ఎలా తెలుస్తుంది?
నేలపై అడ్డంగా కాళ్ళు వేసి కూర్చుని ఎలాంటి సపోర్ట్ లేకుండా లేవగలిగితే కండరాలు బలంగా ఉన్నాయని అర్థం. అలాగే, 1 గంట పాటు కుర్చీపై కూర్చున్న తర్వాత కూడా ఎలాంటి వెన్నునొప్పి లేకపోతే కండరాల పరిస్థితి బాగున్నట్టు. అయితే, కొన్నిసార్లు ఇతర భాగాల కండరాలు బలహీనంగా మారవచ్చు. ఒకవేళ కండరాలు బలహీనంగా మారుతున్నాయంటే భుజం, చేతిలో నిరంతరం నొప్పి కలుగుతుంది. అంతేకాకుండా మోకాళ్లలో నొప్పి ఉంటే, కండరాలు బలహీనపడుతున్నాయని అర్థం.
Also read: Lung Health: ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
కండరాలను ఎలా బలోపేతం చేయాలి?
మన శరీరంలో వందలాది కండరాలు ఉంటాయి. ఇవి ఎముకలలో కుషన్లుగా పనిచేస్తాయి. కండరాలను బలోపేతం చేయడానికి వాకింగ్ తో పాటు ప్రతిరోజూ అరగంట వ్యాయామం కూడా చేయాలి. అంతేకాకుండా కండరాలను బలోపేతం చేయడానికి వెయిట్ లిఫ్టింగ్ వ్యాయామాలు చేయాలి. డంబెల్స్, పుషప్స్, వెయిట్‌లతో స్క్వాట్స్, ప్లాంక్, రాడ్‌లతో వ్యాయామం, బర్పీలు చేయాలి. దీంతో కండరాలు బలపడతాయి.
కండరాలను బలోపేతం చేయడానికి ఏమి తినాలి?
కండరాలు బలోపేతం చేయడానికి డైట్ లో ప్రోటీన్, విటమిన్-డి, విటమిన్ బి12, విటమిన్ బి3, కాల్షియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. అంతేకాకుండా వారానికి దాదాపు 4-5 రోజులు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. అధిక ప్రోటీన్ ఉండే గుడ్డు, మాంసం, బఠానీలు బాదం, సోయా బీన్ చిక్‌పీస్ వంటి వాటిని డైట్‌లో ఉండేటట్లు చూసుకోవాలి.


