Thailand Lotus Trend: జెన్ జీ (Gen Z) ట్రెండ్స్ అంటే కొత్తదనం, క్రియేటివిటీ, క్రేజ్ కలగలపింది. ప్రతి కొత్త ఐడియాను స్టైల్‌గా మార్చే ఈ తరం ఇప్పుడు మరో ప్రత్యేక ట్రెండ్‌ను వైరల్ చేస్తోంది. అదే ‘లోటస్ ట్రెండ్’. తామర పూలతో ఫోటోలు దిగుతూ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడం. ప్రస్తుతం ఇది వరల్డ్ వైడ్‌గా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. అంతగా ఆకట్టుకుంటున్న ఈ ట్రెండ్‌కు బ్యాంకాంక్ నగరం కేరాఫ్‌గా నిలిచింది. అక్కడి ప్రసిద్ధ Pak Khlong Talat పూల మార్కెట్ నుంచి ఓల్డ్ మెమోరియల్ బ్రిడ్జ్ (Memorial Bridge) వరకు తామర పూలను చేతిలో పట్టుకుని ఫోటోలు దిగడం ఇప్పుడు వైరల్ ట్రెండ్‌గా మారింది.
హాట్ స్పాట్‌గా మారిన బ్రిడ్జ్
ఈ ట్రెండ్‌ను ‘వైట్ లోటస్ ఎఫెక్ట్’ అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ ఫోటోషూట్‌లకు హాట్ స్పాట్‌గా మారింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే యువత ఇక్కడ తామర పూలతో స్టైలిష్ పిక్స్ తీసుకుని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ ట్రెండ్ ప్రభావంతో తామర పూలకు కూడా విపరీతమైన డిమాండ్ పెరిగింది. పూల మార్కెట్లలో లోటస్ పువ్వుల అమ్మకాలు సైతం గణనీయంగా పెరిగాయి.
న్యూ లగ్జరీగా మారిన ట్రెండ్
జెన్ జీ తరం ఈ లోటస్ ఫోటోలను ‘న్యూ లగ్జరీ’గా భావిస్తోంది. ఖరీదైన వస్తువులు కాకుండా సింపుల్ కానీ అందమైన కాన్సెప్ట్‌లతో స్టైలిష్‌గా కనిపించడం ఈ ట్రెండ్ ప్రత్యేకత. అందుకే ఈ ట్రెండ్ పర్యాటక రంగానికీ కొత్త ఊపును తీసుకువస్తోంది. మొత్తానికి, లోటస్ ట్రెండ్ నార్మల్ ఫ్లవర్‌ని ఫ్యాషన్ ట్రెండ్‌గా మార్చడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. దీంతో జెన్ జీ క్రియేటివిటీకి ఇది మరో నిదర్శనంగా నిలుస్తోంది. ఇక సింపుల్ ఐడియాతో స్టైలిష్‌గా కనిపించాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా మారింది.
Also Read: Lazy Girl Jobs: లేజీ గర్ల్ జాబ్ ట్రెండ్.. అంటే ఏంటో తెలుసా?

