Micro Bags Trend: ఫ్యాషన్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అందుకే ఎప్పటికప్పుడు ట్రెండ్ తగ్గట్టుగా యూత్ ఫ్యాషన్‌ని ఫాలో అవుతుంది. అలాగే ఫ్యాషన్ వరల్డ్‌లోనూ ఎప్పుడు ఏదోకటి కొత్త ట్రెండ్ పుట్టుకోస్తూనే ఉన్నాయి. ఇక ఈ జెన్ జీ తరంలో ఫ్యాషన్ పోకడ వినూత్నంగా ఉంది. వాటి పేర్లు కూడా అంతే భిన్నంగా ఉన్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు ఫ్యాషన్ వరల్డ్‌లో కొత్త రకంగా బ్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి. మొన్నటివరకు ఓవర్‌సైజ్డ్ బ్యాగ్స్, టోట్ బ్యాగ్స్ పెద్ద ఎత్తున ట్రెండ్‌లో ఉండగా ఇప్పుడు వాటిని మించిపోయేలా ‘మైక్రో బ్యాగ్స్’ క్రేజ్ పెరిగింది. చిన్న స్టైజులో స్టైలిష్‌గా డిజైన్ చేసిన ఈ బ్యాగ్స్ ప్రస్తుతం ఫ్యాషన్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.
మైక్రో బ్యాగ్స్ ప్రత్యేకత ఏమిటంటే
ఇవి చాలా చిన్న సైజ్‌లో ఉంటాయి. ఫోన్, కార్డ్స్, ఎయిర్‌పాడ్స్ వంటి అత్యవసర వస్తువులు మాత్రమే తీసుకెళ్లేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేయబడ్డాయి. ముఖ్యంగా జెన్ జీ (Gen Z) ఈ ట్రెండ్‌ను ఎక్కువగా ఫాలో అవుతోంది. బయటకు వెళ్లేటప్పుడు ఎక్కువ వస్తువులు తీసుకువెళ్లకుండ కేవలం అవసరమైన వాటిని మాత్రమే క్యారీ చేసేందుకే ఈ జెన్ జీ ఎక్కువ మక్కువ చూపుతోంది. అందుకే మైక్రో బ్యాగ్స్ ఇప్పుడు ఫ్యాషన్ రంగంలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాయి. ఈ ట్రెండ్‌కు అనుగుణంగా యూరోపియన్ ఫ్యాషన్ బ్రాండ్స్ కూడా తమ డిజైనర్ కలెక్షన్స్‌లో మైక్రో బ్యాగ్స్‌ను లాంచ్ చేస్తున్నాయి.
జెన్ జీ మెచ్చిన మైక్రో బ్యాగ్స్
ఆకర్షణీయమైన డిజైన్స్, కలర్ వేరియేషన్స్‌తో ఈ బ్యాగ్స్ ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా మారుతున్నాయి. మైక్రో బ్యాగ్స్‌ను జెన్ జీ ‘ఐడెంటిటీ కంట్రోల్’గా భావిస్తోంది. అంటే అవసరమైన వాటిని మాత్రమే తమ వెంట తీసుకెళ్లడానికి ఇష్టపడుతున్నారు. దీనివల్ల వారి లైఫ్‌స్టైల్ సింపుల్ అండ్ క్లియర్‌గా మెయింటైన్ చేసుకోవచ్చే అనే అభిప్రాయంలో ఉన్నారు. ఇది కేవలం ఫ్యాషన్ ట్రెండ్ మాత్రమే కాకుండా,మినిమలిస్ట్ లైఫ్‌స్టైల్‌కు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. మొత్తానికి, చిన్న సైజ్‌లో పెద్ద స్టైల్‌ను చూపించే మైక్రో బ్యాగ్స్ ట్రెండ్ ప్రస్తుతం ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ మరింత పాపులర్ అవుతుందని చెప్పడంలో సందేహం లేదు.
Also Read: Butter Run Trend: బటర్ రన్ ట్రెండ్..ఫిట్‌నెస్‌కు కొత్త మజా

