Venus Astrology:భారతీయ సంప్రదాయాల్లో పండుగలు, శుభకార్యాలు, ముఖ్యమైన సందర్భాల్లో కొత్త బట్టలు ధరించడం ఒక ప్రధాన ఆనవాయితీ. ఈ ఆచారాన్ని చాలామంది కేవలం ఆనందం, శుభసూచకంగా భావిస్తారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ అలవాటుకు లోతైన గ్రహ సంబంధం ఉందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా శుక్ర గ్రహం అనుగ్రహం పొందడానికి వస్త్రధారణ కీలక పాత్ర పోషిస్తుందని జ్యోతిష్య గ్రంథాలు సూచిస్తున్నాయి.
శుక్రుడు జ్యోతిష్య దృష్టిలో..
శుక్రుడు జ్యోతిష్య దృష్టిలో సౌందర్యం, ఆకర్షణ, వైభవం, కళలు, ప్రేమ, సంపదలకు అధిపతి. అతని కృప కలిగితే వ్యక్తి జీవితంలో సుఖాలు, భోగాలు, విలాసవంతమైన అనుభవాలు లభిస్తాయి. వ్యక్తి సామాజికంగా గుర్తింపు పొందేలా మారతాడు. అందుకే ఆకర్షణీయమైన దుస్తులు ధరిస్తే శుక్రుడు సులభంగా ప్రసన్నం అవుతారని విశ్వాసం ఉంది.
Also Read:https://teluguprabha.net/health-fitness/health-dangers-of-incense-smoke-explained-by-experts/
ఆకర్షణీయమైన వస్త్రధారణ మనపై మాత్రమే కాకుండా చుట్టూ ఉన్నవారిపై కూడా ప్రభావం చూపుతుంది. మంచి డ్రెస్సింగ్ వల్ల వ్యక్తి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఈ ప్రదర్శన శుక్రుని శక్తిని ఆకర్షించి మనలో ఉన్న ప్రతిభను వెలికి తీయగలదు. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా, ఉన్నత స్థాయికి చేరే అవకాశాలు కలుగుతాయి.
ఫ్యాషన్ లేదా ట్రెండ్ కోసం..
నిపుణుల అభిప్రాయం ప్రకారం వస్త్రధారణ కేవలం ఫ్యాషన్ లేదా ట్రెండ్ కోసం మాత్రమే కాదు. అది వ్యక్తి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంతో పాటు జీవన ప్రమాణాలను కూడా ప్రభావితం చేస్తుంది. సొగసైన బట్టలు ధరించడం ద్వారా మనలోని శక్తులు సమతుల్యం అవుతాయి. ఈ విధంగా శుక్రుడు ఆశీర్వదిస్తాడని వారు అంటున్నారు.
అయితే శుక్రుడు బలహీనంగా ఉంటే జీవితంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయి. ఆర్థిక సమస్యలు ముందుకొస్తాయి, డబ్బు నిలవదు, విలాసవంతమైన జీవనం తగ్గిపోతుంది. అప్పుల భారంతో బాధలు ఎక్కువ అవుతాయి. దాంపత్య జీవితంలో కలహాలు మొదలవుతాయి. ప్రేమ, అనురాగం తగ్గిపోవడంతో వ్యక్తిగత సంబంధాల్లో దూరాలు వస్తాయి.
Also Read:https://teluguprabha.net/health-fitness/herbal-teas-that-help-in-weight-loss-and-improve-metabolism/
ముఖం కాంతిని కోల్పోవడం, చర్మ సమస్యలు, మొటిమలు పెరగడం వంటి పరిస్థితులు కూడా శుక్ర బలహీనత సంకేతాలుగా చెప్పబడతాయి. ఈ కారణంగా వ్యక్తిగత ఆకర్షణ తగ్గిపోతుంది. ఇంట్లో విలాస వస్తువులు ఉన్నా వాటిని ఆస్వాదించే సుఖం లేకపోవడం కూడా శుక్ర ప్రభావం తగ్గిందనే సూచన. అదేవిధంగా మూత్రపిండాలు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు తరచుగా వేధించే అవకాశమూ ఉంది.
ఇలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి శుక్ర గ్రహ దోష నివారణకు పలు పరిహారాలు సూచించబడ్డాయి. వీటిని పాటించడం ద్వారా శుక్రుడు ప్రసన్నం అవుతాడని విశ్వాసం ఉంది.శుక్రుడికి తెలుపు రంగు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పబడింది. అందుకే శుక్రవారం రోజున తెలుపు రంగు దుస్తులు ధరించడం శ్రేయస్కరమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువగా తెలుపు వస్త్రధారణ చేయడం ద్వారా శుక్ర అనుగ్రహం పొందవచ్చని విశ్వాసం.
కనకధారా స్తోత్రం..
శుక్రుడి అధిదేవత మహాలక్ష్మి దేవి. కాబట్టి ప్రతి శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడం, కనకధారా స్తోత్రం పఠించడం మంగళకరంగా భావిస్తారు. దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు తగ్గి, జీవన స్థిరత్వం లభిస్తుంది.
అదేవిధంగా శుక్ర గ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం, శుక్రవారం ఉపవాసం ఉండడం కూడా శ్రేయస్కరం. ఈ విధంగా ఆచరించడం ద్వారా శుక్ర దోషాలు తగ్గుతాయని విశ్వసిస్తారు.
దానధర్మాలు చేయడం..
దానధర్మాలు చేయడం కూడా శుక్రుని బలపరచడానికి మంచి మార్గం. ముఖ్యంగా బియ్యం, పాలు, పెరుగు, పటికబెల్లం వంటి తెలుపు వస్తువులను దానం చేయడం శ్రేయస్కరం. ఇలాంటి దానాలు శుక్రుని కృపను పెంచుతాయని జ్యోతిష్య పండితులు వివరిస్తున్నారు.
ఇంకా ఒక ముఖ్యమైన అంశం పరిశుభ్రత. ఇల్లు, చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. మంచి వాసనలు వచ్చేలా ఉంచడం, ఇంట్లో సువాసనలతో వాతావరణాన్ని శుభ్రపరచడం శుక్రుడికి ఇష్టమైనది.
ఈ పరిహారాలను పాటించడం ద్వారా శుక్రుని శక్తి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురాగలదు. సమాజంలో గౌరవం పెరుగుతుంది, ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది, సంబంధాలు మెరుగుపడతాయి.


