Sock-ant tattoo trend: టాటూలంటేనే యువతలో ఫుల్ క్రేజ్ ఉంటుంది. విభిన్న రకాల డిజైన్లు గల టాటూలు ఎప్పుడూ ట్రెండ్ అవుతుంటాయి. అలాంటిది పవర్ఫుల్ టాటూ వేసుకుంటే పవర్ఫుల్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టే లెక్క. అందుకే థాయ్ లాండ్ టాటూ అంటే సాక్ యాంట్ టాటూలు ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. సాంప్రదాయ థాయ్ టాటూలు ఆధ్యాత్మికతతో నిండి ఉంటాయి. బౌద్ధ సన్యాసులు లేదా ఆధ్యాత్మిక గురువులు ప్రత్యేక మంత్రాలు పఠిస్తూ, చేత్తోనే ఈ టాటూలు వేస్తారు. ఈ ప్రత్యేక టాటూలు ఆధ్యాత్మిక శక్తి, రక్షణ శక్తి, అదృష్టాన్ని, ధైర్యాన్ని ఇస్తాయని థాయ్ ప్రజలు బలంగా విశ్వసిస్తారు. 5 లైన్ల టాటూ అత్యంత ప్రజాదరణ పొందిన టాటూ కాగా ప్రతి లైన్‌కు ఓ ప్రత్యేక రక్షణ మంత్రం ఉంటుంది. థాయ్ లాండ్ టూర్ వెళ్లినవారు చాలామంది ఇలాంటి పచ్చబొట్లను వేయించుకోవటం ట్రావెల్ ట్రెండ్‌గా కూడా మారిపోయింది.
Also Read: Snail Mail Trend: జెన్ జీని ఆకట్టుకుంటున్న హ్యండ్ రైటింగ్ లెటర్స్

