Curd Health Benefits: మనం ఆర్యోగంగా ఉండాలంటే అనేక పోషకాలు ఉన్న ఆహారాలు మన డైట్ లో చేర్చుకోవాలి. మన ఆరోగ్యం మనం తీసుకునే ఆహారం పై ఆధారపడి ఉంటుంది. అయితే, ప్రతిరోజూ భోజనంలో ఒక కప్పు పెరుగు తింటే ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా..? పెరుగులో ప్రోబయోటిక్స్, కాల్షియం, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని అనేక సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. అయితే ఇప్పుడు ప్రతిరోజూ ఒక కప్పు పెరుగు తింటే శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం.
పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పెరుగు మలబద్ధకం, గ్యాస్, ఆమ్లత్వం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. పెరుగు తింటే తిన్న ఆహారం కూడా సులభంగా జీర్ణం అవుతుంది. కడుపు సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.
పెరుగులో ఉండే లాక్టోబాసిల్లస్, బిఫిడోబాక్టీరియం వంటి ప్రోబయోటిక్స్ శరీర వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఇది ఇన్ఫెక్షన్లు, వ్యాధులతో పోరాడడంలో సహాయపడుతుంది. ప్రతిరోజూ పెరుగు తినడం వల్ల జలుబు, ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది.
ఇందులో కాల్షియం, విటమిన్-డి మంచి మూలం. కావున ఇది ఎముకలు, దంతాలను బలపరుస్తుంది. పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఆస్టియోపోరోసిస్, కీళ్ల నొప్పులు వంటి సమస్యలును నివారిస్తుంది. పెరుగులో జింక్, విటమిన్-ఇ, లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంలో, మొటిమలను నివారించడంలో సహాయపడుతుంది. దీని క్రమం తప్పకుండా తీసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది. దీంతోపాటు ముడతలు కూడా తగ్గుతాయి.
అలాగే, ఇందులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని సమతుల్యంగా ఉంచుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మెదడుకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
పెరుగులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, విటమిన్-బి కాంప్లెక్స్ ఉంటాయి. ఇది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. భోజనంలో పెరుగు తినడం వల్ల అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరానికి శక్తిని అందిస్తుంది. ఇది రోజంతా చురుకుగా ఉండేలా చేస్తుంది.