Wednesday, July 16, 2025
Homeలైఫ్ స్టైల్Jamun Fruit Benefits: నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Jamun Fruit Benefits: నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

Jamun Fruit Benefits: నేరడు పండ్లలో అనేక పోషకాలు నిండు ఉంటాయి. ఇది ఆయుర్వేదం, ఆధునిక వైద్యం రెండింటిలోనూ ప్రయోజనకరంగా పరిగణిస్తారు. నేరేడు పండు రుచి పుల్లని తీపి, కొద్దిగా ఆస్ట్రింజెంట్‌గా ఉంటుంది. ఈ పండ్లు వేసవికాలంలో ఎక్కువగా దర్శనమిస్తాయి. నేరేడు పండ్లలో విటమిన్ సి, ఐరన్, పొటాషియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా అనేక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయి. అయితే ఇప్పుడు నేరేడు పండ్లను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

- Advertisement -

డయాబెటిస్ ఉన్నవారు నేరేడు పండ్లను తినొచ్చు. ఇవి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ పండులో ఉండే జామున్, జాముసీన్ వంటి అంశాలు రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడంలో సహాయపడతాయి.

ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో వీటిని తీసుకుంటే జీర్ణక్రియ బలపడుతుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఈ పండ్లు కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో సహాయపడుతాయి.

నేరేడు పండ్లలో ఉండే విటమిన్ సి, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఇది జలుబు, దగ్గు ఇన్ఫెక్షన్, ఇతర రాజుల నుండి రక్షించడంలో సహాయపడుతుంది.

అలాగే, దీనిలో ఉండే పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతాయి. ఇది గుండెను బలంగా చేసింది. అనేక గుండె సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.

బరువు తగ్గాలనుకునేవారు నేరేడు పండ్లను తీసుకుంటే ఎంతో మంచిది. ఇందులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ పండ్లను తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. బరువు తగ్గాలనుకునే వారు వీటిని తీసుకుంటే సులభంగా బరువు తగ్గుతారు. ఈ పండ్లు జీవక్రియను వేగవంతం చేస్తాయి.

నేరేడు పండ్లను తింటే చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ చర్మాన్ని యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. ఇది కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫ్యాటీ లివర్ వంటి సమస్యలను నివారిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News