Dry Skin Remedies:చలికాలం వస్తూనే అనేక సమస్యలను తీసుకువస్తోంది. అందులో డ్రై స్కిన్ ఒకటి. దీంతో చర్మ సమస్యలొస్తాయి. చర్మం పగులుతుంది. కావున చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు, చర్మ సమస్యలను నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. చాలామంది డ్రై స్కిన్ కోసం మార్కెట్లో లభించే మాయిశ్చరైజర్లు, క్రీములు వాడుతుంటారు. ఇవి తాత్కాలిక ఉపశమనాన్ని అందించిన, ఎక్కువ సమయం డ్రై స్కిన్ నివారించడంలో విఫలం అవుతాయి. ఇటువంటి పరిస్థితులలో కొన్ని హోమ్ టిప్స్ పాటిస్తే డ్రై స్కిన్ సమస్యను నివారించవచ్చు. ఇవి చర్మానికి సహజ తేమ, పోషణను అందిస్తాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ క్రమంలో డ్రై స్కిన్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడే కొన్ని హోమ్ టిప్స్ తెలుసుకుందాం.
కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం: కొబ్బరి నూనెలో విటమిన్ E, కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోతుగా పోషిస్తాయి. ప్రతి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను ముఖంపై పూసి మసాజ్ చేయాలి. ఈ చిట్కా తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. పగిలిన చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
తేనె- పాలు ఫేస్ ప్యాక్: తేనె ఒక సహజ మాయిశ్చరైజర్. పాలు చర్మాన్ని మృదువుగా చేస్తుంది. ఒక టీస్పూన్ తేనెను ఒక టీస్పూన్ పచ్చి పాలతో కలిపి ముఖంపై అప్లై చేయాలి. అలాగే 15 నిమిషాల పాటు ఉంచి, గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది తక్షణమే చర్మానికి తేమను పునరుద్ధరిస్తుంది.
కలబంద జెల్: కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, హైడ్రేటింగ్ లక్షణాలు ఉన్నాయి. ముఖంపై పై తాజా కలబంద జెల్ అప్లై చేసి, దాదాపు 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయాలి. ఇది చర్మానికి ఉపశమనం అందిస్తుంది.
అరటిపండు, పెరుగు మాస్క్: పండిన అరటిపండును మెత్తగా చేసి దానికి ఒక టీస్పూన్ పెరుగు జోడించాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై చర్మాన్ని అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. అరటిపండు పొడి చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. పెరుగు దానిని మృదువుగా చేస్తుంది.
నెయ్యితో తేమ చేయడం: నెయ్యిలో సహజ నూనెలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పగిలిన చర్మాన్ని బాగు చేస్తాయి. ఉదయం, రాత్రి మీ బుగ్గలకు తేలికపాటి నెయ్యిని రాయాలి. ఇది తేమను అందించడమే కాకుండా ముఖానికి సహజమైన మెరుపును కూడా ఇస్తుంది.


