Neem Leaves Benefits: వేప ఆకులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆయుర్వేదంలో వీటికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రతిరోజు కొన్ని వేపాకులను నమిలితే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? వేప ఆకులలో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. అందువల్ల ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేపాకులను నమిలితే అనేక వ్యాధులను నివారించవచ్చు.
ఉదయాన్నే వేప ఆకులలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆకులను కమలడం ద్వారా నోటిపూతల, చిగుళ్ల వాపు, దంతా క్షయం వంటి ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇవి దంతాలను బలపరుస్తుంది. దుర్వాసనను తొలగిస్తుంది.
ఈ ఆకులు నమ్మడం ద్వారా జీర్ణ వ్యవస్థ బలపడుతుంది. వేప ఆకులు కడుపు ఆమ్లత్వం, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇది కాలేయాన్ని నిర్వీకరణ చేస్తుంది. అంతేకాకుండా జీర్ణ ఎంజైమ్ లను సక్రియం చేస్తుంది.
ALSO READ: https://teluguprabha.net/lifestyle/try-these-tricolour-foods-on-independence-day/
వేప ఆకులు రక్తాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతాయి. అందువల్ల మొటిమలు, మచ్చలు వంటి చర్మ సంబంధిత సమస్యలు దరి చేరవు. వేప ఆకులను క్రమం తప్పకుండా నమ్మడం వల్ల శరీరం నుండి విష పదార్థాలు తొలగిపోతాయి.
ఖాళీ కడుపుతో వేప ఆకులు నమ్మడం ద్వారా రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి అనేక ఆరోగ్య సమస్యలతో పోరాడే సామర్ధ్యాన్ని పెంచుతాయి. ఇది జలుబు, జ్వరం, ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ALSO READ:https://teluguprabha.net/lifestyle/these-are-the-things-you-shouldnt-do-after-eating/
షుగర్ ఉన్నవారికి వేప ఆకులు ఎంతో మేలు చేస్తాయి. ఇందులో హైపో గ్లై సిమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో చక్కర స్థాయిలను నియంత్రించడంలో ఎంతో సహాయపడుతాయి. తద్వారా డయాబెటిక్ రోగులు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేప ఆకులను నమలడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ సున్ని తత్వాన్ని మెరుగుపరుస్తుంది.
అయితే, ఆరోగ్యానికి మంచిదని ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎక్కువగా వేప ఆకులు తినకూడదు. ఒక్కోసారి ఇది ఆరోగ్యానికి హానికరం కూడా కావచ్చు. కాబట్టి రోజుకు 2-3 ఆకులను మాత్రమే నమలాలి. వేప ఆకుల చేదును నివారించడానికి, లేత వేప ఆకులను తినవచ్చు. ఇందులో చేదు తక్కువగా ఉంటుంది.


