Iron Rich Foods: ప్రస్తుత కాలంలో చాలామంది ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా శాకాహారులు, మహిళలలో ఐరన్ లోపం సర్వసాధారణం. ఐరన్ లోపం శరీరాన్ని బలహీనంగా చేస్తుంది. ఇది రక్తహీనతకు కూడా దారితీస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఐరన్ ఎంతో సహాయపడుతుంది. ఇవి శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకువెళ్తాయి. అయితే శరీరంలో ఐరన్ లోపం అంటే నేరుగా అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడానికి పనిచేసే రక్త కణాల పరిమాణం క్షీణించడం. ఐరన్ లోపాన్ని అధిగమించడానికి సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ఆహారాల సహాయంతో దీని నయం చేయవచ్చు.
పప్పు ధాన్యాలు
పప్పు ధాన్యాలు ఉండని వంటగది ఉండదు. మాసూర్ పప్పు మూంగ్ పప్పు, తూర్ పప్పు మొదలైన వాటిలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. వీటిని ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. పప్పు దాన్యాలు ప్రోటీన్ మంచి మూలం. ఇది శరీరానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజలు చూడటానికి చిన్నవిగా ఉన్న వీటిలో ఐరన్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఐరన్ లో పని తీర్చాలంటే వీటిని కాల్చి తినవచ్చు లేదా సలాడ్లలో చేర్చవచ్చు. గుమ్మడికాయ గింజలు ఐరన్ కు మంచి మూల మాత్రమే కాదు, శరీరానికి మేలు చేసే మెగ్నీషియం, జంక్, ఫైబర్ వంటి పోషకాలు కూడా కలిగి ఉంటుంది.
Also Read: Eye Health: కంటి ఆరోగ్యం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి!
ఎండు ద్రాక్ష
వీటిలో అధిక మొత్తంలో ఐరన్ ఉంటుంది. ఎండు ద్రాక్షలను తేలికపాటి చిరుతిండిగా లేదా పాల వంటకాలలో కూడా చేర్చవచ్చు. ఎండుద్రాక్షలు ఐరన్ కు మంచి మూలం మాత్రమే కాదు శరీరానికి శక్తిని అందించే ఫైబర్, పొటాషియం, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు వంటి పోషకాలు కూడా ఇందులో ఉంటాయి.
బ్లాక్ ఆలివ్
బ్లాక్ ఆలివ్ లో ఐరన్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. వీటిని సలాడ్లు, శాండ్ విచ్ లకు జోడించవచ్చు. బ్లాక్ హాలీవుడ్ లో గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరమైన కొవ్వు రకం కూడా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. అమలు చేసే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.


